Telugu Global
NEWS

ముందస్తు ఎన్నికలు.. ఎందుకు..? ఎవరికోసం..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. పార్టీనుంచి బయటకు వెళ్లేవారెవరూ లేరు, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం లేదు. ఇలాంటి సందర్భంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? మరి చంద్రబాబు చెబుతున్నదేంటి..? పదే పదే ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..? 151 సీట్ల భారీ మెజార్టీ వైసీపీకి ఉంది. టీడీపీనుంచి నలుగురు, జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకి వచ్చేశారు. ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా […]

ముందస్తు ఎన్నికలు.. ఎందుకు..? ఎవరికోసం..?
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. పార్టీనుంచి బయటకు వెళ్లేవారెవరూ లేరు, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం లేదు. ఇలాంటి సందర్భంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? మరి చంద్రబాబు చెబుతున్నదేంటి..? పదే పదే ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?

151 సీట్ల భారీ మెజార్టీ వైసీపీకి ఉంది. టీడీపీనుంచి నలుగురు, జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకి వచ్చేశారు. ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా ముందస్తుకు వెళ్లే సాహసం చేస్తుందా..? పోనీ ముందస్తుకి వెళ్లడం వల్ల వైసీపీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి..? ఎక్కడైనా ముందస్తు ఎన్నికలంటే ప్రజా ధనం ముందుగా వృథా అవుతుందనే భావన అందరిలోనూ ఉంది. అలాంటిది ఇప్పుడు జగన్ ముందస్తు ఎన్నికలంటే ఆ నిర్ణయంపై వ్యతిరేక ప్రభావం ఉంటుందనే అనుమానం కూడా ఉంది. అయితే చంద్రబాబు కేవలం తన స్వలాభం కోసమే ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

గతంలోనే సజ్జల క్లారిటీ..
గతంలో కూడా ఓసారి చంద్రబాబు ఇలా ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి, తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి అంటూ దిశానిర్దేశం చేశారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు ముందస్తుకి వెళ్లాల్సిన అవసరం తమకేముందని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు చెల్లాచెదరు కాకుండా చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు వేస్తుంటారని, అందుకే ముందస్తు జపం చేస్తున్నారని అన్నారు.

ముందస్తు ముచ్చట వట్టిదే..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు ఏపీలో ఎన్నికలు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో గెలవాలంటూ వైసీపీకి సవాల్ విసిరారు. ఆ తర్వాత మూడురాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలన్నారు, ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు కూడా. కానీ సీఎం జగన్, బాబు మాటలకు అస్సలు స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికలదాకా ఎందుకు.. మీ ప్రతాపం స్థానిక ఎన్నికల్లో చూపించండి అంటూ అప్పట్లో టీడీపీకి సవాల్ విసిరారు వైసీపీ నేతలు. కానీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ మరింత దారుణంగా దెబ్బతిన్నది. దీంతో కొన్నాళ్లు ముందస్తు ఎన్నికల ముచ్చట రాలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు పాతపాటే పాడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, సిద్ధంగా ఉండండి తమ్ముళ్లూ అంటూ పాత పల్లవి అందుకున్నారు.

First Published:  18 May 2022 5:10 AM IST
Next Story