అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో రైతు రుణమాఫీ..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రూ.2లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారాయన. ఏడేళ్లలో కేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రూ.2లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారాయన. ఏడేళ్లలో కేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఈ దఫా తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు.
విద్య, వైద్యం, నిరుద్యోగ డిక్లరేషన్లు..
హన్మకొండ సభలో రాహుల్ గాంధీ మీటింగ్ లో రైతులకోసం వరంగల్ డిక్లరేషన్ ని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ సహా, పెట్టుబడి సాయం.. తదితరాలపై ఈ డిక్లరేషన్ లో వివరించారు. దీన్ని ఊరూరా, వాడవాడలా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతు రచ్చబండ అనే కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లు ప్రకటిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంటల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉండవని.. పంట మార్పిడి అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
రైతులకు రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో వృథా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామన్నారు. రైతుబంధును పేదలకు ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ధనికులకు కూడా ఎందుకిస్తోందని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణ ఇచ్చామని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కచ్చితంగా ఈసారి అధికారం కాంగ్రెస్ దేనంటున్నారు రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను తెలంగాణ నుంచే మొదలు పెట్టే విధంగా రాహుల్ గాంధీని కోరతామన్నారు రేవంత్ రెడ్డి.