Telugu Global
International

మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేశారు. కరుడు గట్టిన మత మౌడ్యులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చెజిక్కించునప్పటి నుండి ఎన్నికల సంఘం, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఆఫ్ఘన్‌ల స్వేచ్ఛను రక్షించే అనేక సంస్థలను మూసివేశారు. “మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి మాకు న్యాయవ్యవస్థతో ముడిపడి ఉన్న కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి, ” అని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని మీడియాతో చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ […]

మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేసిన తాలిబన్లు
X

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేశారు. కరుడు గట్టిన మత మౌడ్యులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చెజిక్కించునప్పటి నుండి ఎన్నికల సంఘం, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఆఫ్ఘన్‌ల స్వేచ్ఛను రక్షించే అనేక సంస్థలను మూసివేశారు.

“మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి మాకు న్యాయవ్యవస్థతో ముడిపడి ఉన్న కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి, ” అని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని మీడియాతో చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పుడు మానవహక్కుల కమిషన్ ఉన్నత అధికారులు దేశం నుండి పారిపోయారు. అప్పటి నుండే ఆ సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ స‍ంస్థే రద్దైపోయింది.

ఆఫ్ఘ‌న్ లో జాతీయ భద్రతా మండలి, శాంతిని ప్రోత్సహించేందుకు స్థాపించిన‌ సయోధ్య మండలి కూడా గత వారాంతంలో మూసివేయబడ్డాయి. “ఈ విభాగాలు అవసరమని మేమనుకోవడం లేదు కాబట్టి వాటిని రద్దు చేశాము. భవిష్యత్తులో అవి అవసరమైతే, వారు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చు” అని శ్రీ సామంగాని చెప్పారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ అసోసియేట్ మహిళా హక్కుల డైరెక్టర్ హీథర్ బార్ మాట్లాడుతూ, సంస్థల మూసివేతలు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు.

తాలిబన్లు గతంలో 1996 నుండి 2001 వరకు వారి మొదటి పాలన కంటే ఇప్పుడు మృదువైన, స్వేచ్చాయుతమైన‌ పాలన అందిస్తామని వాగ్దానం చేశారు, అయితే విద్య, పని మరియు దుస్తులపై మహిళల స్వేచ్ఛను క్రమంగా హరించారు.

First Published:  18 May 2022 2:38 AM GMT
Next Story