లండన్ లో మంత్రి కేటీఆర్ కి ఆత్మీయ స్వాగతం..
యూకే, దావోస్ పర్యటనకోసం లండన్ చేరుకున్న మంత్రి కేటీఆర్ కి అక్కడ ఘన స్వాగతం లభించింది. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కి అధికారిక స్వాగతం పలికారు. యూకే టీఆర్ఎస్ విభాగంతోపాటు, ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది లండన్ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. తెలుగు ప్రజలు కేటీఆర్ కి పూల
యూకే, దావోస్ పర్యటనకోసం లండన్ చేరుకున్న మంత్రి కేటీఆర్ కి అక్కడ ఘన స్వాగతం లభించింది. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కి అధికారిక స్వాగతం పలికారు. యూకే టీఆర్ఎస్ విభాగంతోపాటు, ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది లండన్ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. తెలుగు ప్రజలు కేటీఆర్ కి పూల బొకేలు ఇచ్చారు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. యూకేలో ఆయన పర్యటన నాలుగురోజులపాటు కొనసాగుతుంది.
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో ఆయన సమావేశం అవుతారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇక్కడి మౌలిక సదుపాయాల గురించి వారికి వివరిస్తారు. యూకే పర్యటన 21వ తేదీతో ముగుస్తుంది.
ఆ తర్వాత 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న తొలి సదస్సు కావడంతో.. దీనికి అత్యథిక ప్రాధాన్యత ఉంది. ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులు, వ్యాపారవేత్తలతో చర్చించడంతోపాటు వర్క్ షాప్ లు, వార్షిక సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలసి కేటీఆర్ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35మంది వ్యాపారవేత్తలతో ఆయన సమావేశమవుతారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దావోస్ లో అత్యాధునిక లాంజ్ ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధికి ఉన్న అవకాశాలను అక్కడ ప్రదర్శిస్తారు.
ఇప్పటికే ఐటీ రంగానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ఫార్మా, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలను కూడా విరివిగా తెలంగాణకు రప్పించేందుకు ఆయా సంస్థలతో కేటీఆర్ చర్చలు జరుపుతారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ప్రపంచస్థాయి ఆహార ఉత్పత్తులు, బేవరేజెస్ కంపెనీలను తెలంగాణకు రప్పించేందుకు కేటీఆర్ పర్యటన ఉపయోగపడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి.