ఎస్ బీ ఐ కి ఝలక్ ఇచ్చిన వినియోగదారుల కమిషన్…సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సొమ్మును చెల్లించాల్సిందే అని తీర్పు
సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనేక మంది బ్యాంకు ఖాతాదారుల సైబర్ నేరగాళ్ళ బారినపడి లక్షల రూపాయలు కోల్పోతున్నారు. కొన్ని సార్లు ఈ నేరగాళ్ళను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వాళ్ళనుండి కొట్టేసిన సొమ్మును తిరిగి రాబట్టలేకపోతున్నారు. మరో వైపు బ్యాంకులు కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతో వినియోగద్శారులే బలవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు వినియోగదారులకు ఊరటనిస్తున్నది. సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సొమ్మును బ్యాంకు […]
సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనేక మంది బ్యాంకు ఖాతాదారుల సైబర్ నేరగాళ్ళ బారినపడి లక్షల రూపాయలు కోల్పోతున్నారు. కొన్ని సార్లు ఈ నేరగాళ్ళను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వాళ్ళనుండి కొట్టేసిన సొమ్మును తిరిగి రాబట్టలేకపోతున్నారు. మరో వైపు బ్యాంకులు కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతో వినియోగద్శారులే బలవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు వినియోగదారులకు ఊరటనిస్తున్నది.
సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సొమ్మును బ్యాంకు వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిందే అని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ చెర్లపల్లికి చెందిన ఎంకే మిశ్రా అనే ఎస్ బీ ఐ ఖాతాదారుడు అదే బ్యాంకు నుండి 3 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నాడు. అయితే అతను ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునే లోపు సైబర్ నేరగాళ్ళు 2013 మే 5వ తేదీ నుంచి 7 వ తేదీ వరకూ 1 లక్షా 46 వేల రూపాయలను కాజేశారు. దాంతో మిశ్రా ఇటు బ్యాంకు కు అటు పోలీసులకు పిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. చివరకు మిశ్రా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీ తో సహా ఎస్ బీ ఐ వినియోగదారుడికి చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఎస్ బీ ఐ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు చేసింది. విచారణ జరిపిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యులు మీనా రామనాథన్, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం ఎస్ బీ ఐ వాదనను తోసిపుచ్చి జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్దించింది. సైబర్ నేరగాళ్ళ ను కనిపెట్టడంలో ఎస్ బీ ఐ వైఫల్యాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఇది పూర్తిగా బ్యాంకు సేవాలోపమేనంటూ బ్యాంకుకు మొట్టికాయలు వేసింది.
ALSO READ: మోడీ ప్రభుత్వం అమ్మేసిన 23 ప్రభుత్వ రంగ సంస్థలివే !