Telugu Global
NEWS

ఎత్తివేత సరే.. పోస్టింగ్‌ ఇస్తారా?

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో రెండేళ్లకు పైగా ఏబీ సస్పెన్షన్‌లో ఉన్నారు. తన సస్పెన్షన్‌ అక్రమం అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఐపీఎస్ అధికారి అయిన తనను రెండేళ్లకు మించి సస్పెండ్ చేయడానికి లేదని.. దాన్ని కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఏబీ వాదించారు. 2022 ఫిబ్రవరిలోనే తన సస్పెన్షన్ […]

ఎత్తివేత సరే.. పోస్టింగ్‌ ఇస్తారా?
X

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో రెండేళ్లకు పైగా ఏబీ సస్పెన్షన్‌లో ఉన్నారు.

తన సస్పెన్షన్‌ అక్రమం అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఐపీఎస్ అధికారి అయిన తనను రెండేళ్లకు మించి సస్పెండ్ చేయడానికి లేదని.. దాన్ని కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఏబీ వాదించారు. 2022 ఫిబ్రవరిలోనే తన సస్పెన్షన్ రెండేళ్ల కాలం ముగిసిందని, కేంద్రం నుంచి పొడిగింపునకు నోటిఫికేషన్ రాలేదని కాబట్టి తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

ఏబీ వెంకటేశ్వరరావు వినతిని మన్నించిన సుప్రీంకోర్టు ఇటీవల సర్వీసులో జాయిన్ చేసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలంటూ ఇటీవల సీఎస్‌ను కలిసేందుకు వెళ్లగా.. ఏబీని సీఎస్‌ కలవకుండానే సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వంపై మరోసారి న్యాయపోరాటం చేయాలని ఏబీ ఆలోచన చేస్తున్న తరుణంలోనే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నేడు ఉత్తర్వులు ఇచ్చింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి సర్వీసును పునరుద్దరిస్తున్నట్టు వెల్లడించింది.

పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెండ్ ఎత్తివేసి సర్వీసులోకి తీసుకున్నప్పటికీ..ఆయనకు ఏదైనా పోస్టు అప్పగిస్తారా లేక అలా కాలం వెళ్లదీస్తారా అన్నది చూడాలి.

First Published:  18 May 2022 7:13 AM IST
Next Story