Telugu Global
NEWS

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. వారికి అనూహ్య అవకాశం..!

ఉత్కంఠ వీడింది. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అనూహ్యంగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఇక తెలంగాణ రాష్ట్రానికే చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డికి చాన్స్ లభించింది. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కగా.. వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు జగన్. ఈ […]

ycp-rajya-sabha-candidates-finalized-ap-minister-botsa-satyanarayana-sajjala-ramakrishnareddy-reveal-the-names-of-the-candidates
X

ఉత్కంఠ వీడింది. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అనూహ్యంగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఇక తెలంగాణ రాష్ట్రానికే చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డికి చాన్స్ లభించింది.

విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కగా.. వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు జగన్. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బొత్స, సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు తమ ప్రభుత్వం అధికప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అందుకే వారికి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ అని సీఎం అభిప్రాయమని సజ్జల చెప్పారు. ఈ సందర్భంగా తనను రాజ్య సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆర్. కృష్ణయ్య సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: కిరణ్‌ కుమార్‌ రెడ్డి రుణం తీర్చుకుంటారా?

First Published:  17 May 2022 12:58 PM IST
Next Story