Telugu Global
National

రాయితీకి మంగళం..రైల్వేకి భారీ ఆదాయం ..

భారతీయ రైల్వే వివిధ వర్గాలకు గతంలో రాయితీలు ఇచ్చేది. కరోనా కాలంలో అసలు రైళ్లే లేవు కాబట్టి, ఈ రాయితీలు కూడా ఆగిపోయాయి. తిరిగి రైళ్లను పునరుద్ధరించిన తర్వాత కొన్నాళ్లపాటు రాయితీలు ఇవ్వలేమన్నారు. అయితే దాన్ని కొనసాగించుకుంటూ పోతున్నారు. రాయితీలకు పూర్తిగా మంగళం పాడేశారు. ఇలా రాయితీలకు దూరమై రైల్వే సంపాదించిన ఆదాయం ఎంతో తెలుసా..? అక్షరాలా 1500కోట్ల రూపాయలు. ఇది కేవలం వృద్ధుల రాయితీ మాత్రమే. ఇంకా వికలాంగులు, జర్నలిస్ట్ లు, ట్రాన్స్ జెండర్లు.. ఇలా […]

రైల్వేకి భారీ ఆదాయం
X

భారతీయ రైల్వే వివిధ వర్గాలకు గతంలో రాయితీలు ఇచ్చేది. కరోనా కాలంలో అసలు రైళ్లే లేవు కాబట్టి, ఈ రాయితీలు కూడా ఆగిపోయాయి. తిరిగి రైళ్లను పునరుద్ధరించిన తర్వాత కొన్నాళ్లపాటు రాయితీలు ఇవ్వలేమన్నారు. అయితే దాన్ని కొనసాగించుకుంటూ పోతున్నారు. రాయితీలకు పూర్తిగా మంగళం పాడేశారు. ఇలా రాయితీలకు దూరమై రైల్వే సంపాదించిన ఆదాయం ఎంతో తెలుసా..? అక్షరాలా 1500కోట్ల రూపాయలు. ఇది కేవలం వృద్ధుల రాయితీ మాత్రమే. ఇంకా వికలాంగులు, జర్నలిస్ట్ లు, ట్రాన్స్ జెండర్లు.. ఇలా దాదాపు 53 రకాల రాయితీలను రైల్వే ఇవ్వాల్సి ఉన్నా.. కరోనా పేరు చెప్పి వాటిని ఆపేశారు.

కరోనా సమయంలో రాయితీలు నిలిపివేసి, ప్రయాణికులనుంచి పూర్తి చార్జీలు వసూలు చేసింది రైల్వే. రెండేళ్ల కాలంలో వృద్ధులకు రాయితీ నిలిపివేయడం వల్ల రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు రైల్వేశాఖ ఈ సమాధానమిచ్చింది.

మార్చి 20, 2020 నుంచి మార్చి 31, 2022 మధ్యకాలంలో సీనియర్‌ సిటిజన్లకు అందించే రాయితీని భారతీయ రైల్వే నిలిపివేసింది. ఆ సమయంలో 7.31 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లు సాధారణ రేట్లకే టికెట్ కొని ప్రయాణించారు. ఇలా సీనియర్ సిటిజన్లనుంచి టికెట్ ఆదాయం రూ.3464 కోట్లు రాగా, వారికి రాయితీ ఇవ్వకపోవడం వల్ల రైల్వేకు రూ.1500 కోట్లు అదనపు ఆదాయం సమకూరినట్లయింది.

50ఏళ్ల వయసు పైబడిన మహిళలకు 50శాతం రాయితీ ఇస్తుంది రైల్వే, 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు చార్జీలో 40 శాతం రాయితీ ఉంటుంది. ఇలా వివిధ కేటగిరీలకు వివిధ రాయితీలు ఇస్తుంటుంది. మొత్తం 53 కేటగిరీలకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఏటా రైల్వే 2వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుండేది. ఇప్పుడు రాయితీలు లేకపోవడంతో ఈ ఆదాయమంతా అదనంగా రైల్వేకు దఖలుపడింది.

ALSO READ: ఓట్ల రాజకీయంలో ‘జ్ఞానవాపి’

First Published:  17 May 2022 3:04 AM IST
Next Story