Telugu Global
NEWS

నేనే నంబర్ వన్.. జోకోవిచ్ ప్రపంచ రికార్డు!

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడిగా తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును మరోసారి తానే అధిగమించాడు. పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏటీపీ విడుదల చేసిన తాజార్యాంకింగ్స్‌ ప్రకారం జొకోవిచ్‌ 8, 660 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 370 […]

నేనే నంబర్ వన్.. జోకోవిచ్ ప్రపంచ రికార్డు!
X

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడిగా తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును మరోసారి తానే అధిగమించాడు. పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏటీపీ విడుదల చేసిన తాజార్యాంకింగ్స్‌ ప్రకారం జొకోవిచ్‌ 8, 660 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 370 వారాలపాటు ఈ స్థానం లో నిలవడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

ఫెదరర్ ను మించిన జోకోవిచ్..
ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహకంగా జరిగిన 2022 ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో స్టెఫానోస్ సిటిస్ పాస్ ను వరుస సెట్లలో చిత్తు చేయడం ద్వారా జోకోవిచ్ తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకోగలిగాడు. గతంలో 310 వారాలపాటు టాప్ ర్యాంకర్ గా కొనసాగిన స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ రికార్డును జోకోవిచ్ 60 వారాల మేర అధిగమించి 370 వారాలతో తనకుతానే సాటిగా నిలిచాడు. తన కెరియర్ లో ఆరోసారి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్ టాప్ సీడ్ హోదాలో 2022 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటకు దిగనున్నాడు.

5వ ర్యాంకులో రాఫెల్ నడాల్
క్లేకోర్టు టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రాఫెల్ నడాల్ 5, 525 పాయింట్లతో ఐదోర్యాంక్ కు పడిపోయాడు. తన కెరియర్ లో 209 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న నడాల్..గత కొంతకాలంగా గాయాలు, పరాజయాలతో టాప్ ర్యాంక్ ను నిలుపుకోలేకపోయాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ 7, 990 పాయింట్లతో రెండు, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ 7, 200 పాయింట్లతో మూడు, గ్రీకువీరుడు స్టెఫానోస్ సిటిస్ పాస్6, 170 పాయింట్లతో నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. స్పానిష్ యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్ 4, 770 పాయింట్లతో 6వ ర్యాంక్ లో నిలిచాడు.

First Published:  17 May 2022 1:19 AM GMT
Next Story