Telugu Global
International

30 ఏళ్ళ తర్వాత రష్యా నుండి వైదొలుగుతున్న మెక్‌డొనాల్డ్స్

30 ఏళ్ళుగా రష్యాలో వ్యాపారం చేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఆ దేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ అత్యంత పేరెన్నికల గల పుష్కిన్ స్క్వేర్ రెస్టారెంట్ తో సహా దేశంలోని మొత్తం 850 రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించుకుంది. అమెరికన్ పెట్టుబడిదారీ విధానానికి చిహ్నమైన మెక్ డోనాల్డ్స్ 1990లో రష్యాలో తమ స్టోర్లను ప్రారంభించడం అప్పట్లో సంచలనమే. తమ మొదటి స్టోర్ ప్రారంభానికి […]

30 ఏళ్ళ తర్వాత రష్యా నుండి వైదొలుగుతున్న మెక్‌డొనాల్డ్స్
X

30 ఏళ్ళుగా రష్యాలో వ్యాపారం చేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఆ దేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ అత్యంత పేరెన్నికల గల పుష్కిన్ స్క్వేర్ రెస్టారెంట్ తో సహా దేశంలోని మొత్తం 850 రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించుకుంది.

అమెరికన్ పెట్టుబడిదారీ విధానానికి చిహ్నమైన మెక్ డోనాల్డ్స్ 1990లో రష్యాలో తమ స్టోర్లను ప్రారంభించడం అప్పట్లో సంచలనమే. తమ మొదటి స్టోర్ ప్రారంభానికి దాదాపు 5 వేల మంది రష్యన్లు హాజరయ్యారు.

“ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం, అనూహ్యమైన ఆపరేటింగ్ వాతావరణం వల్ల ఇక ఇక్కడ తాము వ్యాపారం చేయలేమని నిర్ధారణకు వచ్చాము” అని మెక్డోనాల్డ్స్ పేర్కొంది. తమ 850 స్టోర్లను స్థానికులకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నామని, అప్పటి వరకు తమ స్టోర్లలో పనిచేస్తున్న 62,000 మంది ఉద్యోగులకు వేతనాలు అందేలా చూస్తామని ఆ సంస్థ పేర్కొంది. రష్యాలోని తమ 847 రెస్టారెంట్ల ద్వారా మెక్డోనాల్డ్స్ నెలకు 50 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించేది.

First Published:  17 May 2022 10:03 AM IST
Next Story