దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు ఐదు వామపక్షాల పిలుపు
మే 25 నుంచి 31 వరకు దేశవ్యాప్త నిరసనలకు లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని నిర్వహించాలని ఆ పార్టీలు తమ యూనిట్లను ఆదేశించాయి. పెట్రోలియం ఉత్పత్తులపై సర్‌ఛార్జీలు/సెస్‌లను వెనక్కి తీసుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా గోధుమ సరఫరాలను పునరుద్ధరించాలని, పప్పులు, వంట నూనెలతో సహా అవసరమైన వస్తువుల పంపిణీ ద్వారా PDSని బలోపేతం చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. “నిరంతరంగా ధరల పెరుగుదల ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపుతోంది. […]
మే 25 నుంచి 31 వరకు దేశవ్యాప్త నిరసనలకు లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని నిర్వహించాలని ఆ పార్టీలు తమ యూనిట్లను ఆదేశించాయి.
పెట్రోలియం ఉత్పత్తులపై సర్‌ఛార్జీలు/సెస్‌లను వెనక్కి తీసుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా గోధుమ సరఫరాలను పునరుద్ధరించాలని, పప్పులు, వంట నూనెలతో సహా అవసరమైన వస్తువుల పంపిణీ ద్వారా PDSని బలోపేతం చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
“నిరంతరంగా ధరల పెరుగుదల ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపుతోంది. పెరుగుతున్న ఆకలి బాధలతో కోట్లాది మంది కష్టాలు పడుతున్నారు. తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. అంచనాలకు మించి నిరుద్యోగం పెరిగిపోయింది. ఇది ప్రజల కష్టాలను మరింత పెంచుతోంది” అని ఒక ఉమ్మడి ప్రకటనలో వామపక్షాలు పేర్కొన్నాయి.
ఈ ప్రకటనపై సంతకాలు చేసినవారిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డి. రాజా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ దేబబ్రత బిస్వాస్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మనోజ్ భట్టాచార్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు
గత ఏడాది కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70 శాతం, కూరగాయల ధరలు 20 శాతం, వంటనూనెల ధరలు 23 శాతం, తృణధాన్యాల ధరలు 8 శాతం పెరిగాయి. కోట్లాది మంది భారతీయుల ప్రధాన ఆహారం గోధుమల ధర 14 శాతానికి పైగా పెరగడం ప్రజలకు భరించలేనిదిగా మారింది. పైగా గోధుమ సేకరణ తగ్గింది” అని వామపక్షాల ప్రకటన తెలిపింది. గోధుమ సేకరణ విధానంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కేంద్రం గత ఏడాదిలో సగం కంటే తక్కువ గోధుమలను సేకరించిందని పేర్కొంది.
“ఈ సంవత్సరం సేకరణ లక్ష్యం 44.4 మెట్రిక్ టన్నులుండగా అది 20 మెట్రిక్ టన్నులు దాటేట్టు లేదని, పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతర పెరుగుతూనే ఉన్నాయని వామపక్షాలు ఆరోపించాయి. గోధుమల యొక్క తీవ్రమైన కొరత, బొగ్గు కొరత, విపరీతమైన విద్యుత్ ఖర్చు వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోందని ప్రకటనలో పేర్కొంది. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ చట్టం చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.