మాల, మాదిగలను వేరుచేసింది బాబే.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల ముందు కేఏ పాల్ బాగానే హడావుడి చేశారు. ప్రజాశాంతి అనే పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. అయితే ఈ పార్టీ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఆ తర్వాత కేఏ పాల్ పత్తా లేకుండా పోయారు. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుండేవారు. ఇక నిత్యం యుద్ధాలు ఆపుతానని.. ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. వీటిలో నిజానిజాలు పక్కకు పెడితే […]
గత ఎన్నికల ముందు కేఏ పాల్ బాగానే హడావుడి చేశారు. ప్రజాశాంతి అనే పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. అయితే ఈ పార్టీ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఆ తర్వాత కేఏ పాల్ పత్తా లేకుండా పోయారు. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుండేవారు. ఇక నిత్యం యుద్ధాలు ఆపుతానని.. ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. వీటిలో నిజానిజాలు పక్కకు పెడితే పాల్ మాటలు తెలుగు ప్రజలకు ఫుల్ ఫన్ ఇస్తుంటాయి.
ఇక ఇటీవల కేఏపాల్ మరోసారి యాక్టివ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కేఏపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు.
‘టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే మాల, మాదిగల మధ్య చిచ్చు రేగింది. ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి ఆయన ఇరు వర్గాల మధ్య గొడవ పెట్టారు. ఇక దీనివల్ల ఎక్కువ లబ్ధి పొందింది మందకృష్ణ మాదిగ. కొందరు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బీజేపీతో అంటకాగుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎవరూ నమ్మొద్దు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు నా వెనకే ఉన్నారు’ అంటూ మాట్లాడారు పాల్.