మహానాడు వేదిక వివాదం
టీడీపీ మహానాడు వేదిక విషయంలో టీడీపీకి, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఒంగోలు మినీ స్డేడియంను మహానాడు నిర్వాహణకు ఇవ్వాలని టీడీపీ దరఖాస్తు చేసుకుంది. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు మిని స్టేడియం లీజుకు డబ్బులు కూడా చెల్లించామని.. ఇన్ని రోజులు నాన్చి ఇప్పుడు అనుమతి ఇవ్వలేం అని చెప్పడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు. మినీ స్డేడియం ఏమైనా మీ తాత జాగీరా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. వర్షం వస్తే […]

టీడీపీ మహానాడు వేదిక విషయంలో టీడీపీకి, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఒంగోలు మినీ స్డేడియంను మహానాడు నిర్వాహణకు ఇవ్వాలని టీడీపీ దరఖాస్తు చేసుకుంది. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు మిని స్టేడియం లీజుకు డబ్బులు కూడా చెల్లించామని.. ఇన్ని రోజులు నాన్చి ఇప్పుడు అనుమతి ఇవ్వలేం అని చెప్పడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు.
మినీ స్డేడియం ఏమైనా మీ తాత జాగీరా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. వర్షం వస్తే ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మినీ స్డేడియంను లీజుకు కోరినట్టు టీడీపీ చెబుతోంది. అధికారులు మాత్రం మినీ స్డేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జరుగుతాయని అందుకే అనుమతి ఇవ్వలేకపోయామని చెబుతున్నారు.
ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో.. మహానాడును ఒంగోలు సమీపంలో గుంటూరు రోడ్డు వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. బృందావనం కల్యాణ మండలం వెనుక స్థలంలో ఏర్పాటు చేసేందుకు బుధవారం భూమి పూజ చేయనున్నారు. అయితే వర్షం ఇస్తే ఇబ్బంది లేకుండా ఉండేందుకు మినీ స్డేడియం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అవసరమైన న్యాయపోరాటం చేసేందుకూ సిద్ధమని పార్టీ నేతలకు వివరించారు.