Telugu Global
Cinema & Entertainment

20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్ రిలీజ్.. కానీ ప్రేక్షకులకు బిగ్ ట్విస్ట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవగణ్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియా లో టాప్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ 4వ స్థానంలో నిలిచింది. ఇటీవలే ఈ సినిమా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ […]

20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్ రిలీజ్.. కానీ ప్రేక్షకులకు బిగ్ ట్విస్ట్..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవగణ్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియా లో టాప్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ 4వ స్థానంలో నిలిచింది. ఇటీవలే ఈ సినిమా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ఓటీటీలో విడుదల కాబోతోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే వారికి జీ5 సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది. మామూలుగా ఏదైనా ఓటీటీని సబ్ స్క్రైబ్ చేసుకుంటే అందులో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ వ్యాలిడిటీ మేరకు ఉచితంగా చూడవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ ను కూడా ప్రేక్షకులు అలాగే చూడాలనుకోగా జీ5 ట్విస్ట్ పెట్టింది. ఈ సినిమాను 20వ తేదీ ఓటీటీలో విడుదల చేస్తున్నప్పటికీ డబ్బు చెల్లించి మాత్రమే చూడాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తున్నారు. మామూలుగా జీ5 ఏడాది ప్లాన్ రూ. 599కి లభిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలి అనుకుంటే అదనంగా రూ.100 చెల్లించి మొత్తం రూ. 699 పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి వారం రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది. వాచ్ టైం వ్యాలిడిటీ కూడా 24 గంటలు మాత్రమే ఇచ్చారు. అంతకు ముందే జీ5 సబ్ స్క్రైబ్ చేసుకున్న వారు కూడా అదనంగా సొమ్ము చెల్లించి చూడవలసి ఉంటుంది. ఇలా డబ్బు చెల్లించి సినిమా చూసే పద్ధతి ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో జీ5 ప్రకటించలేదు.

First Published:  16 May 2022 7:25 AM IST
Next Story