Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ బాటలో కేజీఎఫ్2 కూడా..!

ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అయితే సబ్ స్క్రిప్షన్ ఉన్నోళ్లంతా ఈ సినిమా చూడలేరు. సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా మరో వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ ను స్ట్రీమింగ్ లో చూడొచ్చు. అలా చిన్న మెలిక పెట్టింది జీ5. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సినిమా రిలీజై 50 రోజులు పూర్తయిన తర్వాత, మళ్లీ ఓటీటీ వీక్షణ కోసం డబ్బులు వసూలు చేయడం దారుణం అంటూ […]

ఆర్ఆర్ఆర్ బాటలో కేజీఎఫ్2 కూడా..!
X

ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అయితే సబ్ స్క్రిప్షన్ ఉన్నోళ్లంతా ఈ సినిమా చూడలేరు. సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా మరో వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ ను స్ట్రీమింగ్ లో చూడొచ్చు. అలా చిన్న మెలిక పెట్టింది జీ5. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సినిమా రిలీజై 50 రోజులు పూర్తయిన తర్వాత, మళ్లీ ఓటీటీ వీక్షణ కోసం డబ్బులు వసూలు చేయడం దారుణం అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఓవైపు ఈ విమర్శలు ఇలా కొనసాగుతుండగానే, మరోవైపు ఆర్ఆర్ఆర్ బాటలో కేజీఎఫ్2 కూడా వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అయితే ఫ్రీగా మాత్రం కాదు. ఈరోజు కేజీఎఫ్2 సినిమా అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ సినిమా చూడలేం. సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి. అప్పుడు మాత్రమే కేజీఎఫ్2 ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన సినిమాను 48 గంటల్లో, అంటే 2 రోజుల్లో పూర్తి చేయాలన్నమాట. అలా చూడలేకపోతే, మళ్లీ 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ బాటలో కేజీఎఫ్2 కూడా ఎంటరవ్వడంతో సోషల్ మీడియాలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆల్రెడీ చందా తీసుకున్న తర్వాత, తిరిగి అదనంగా చెల్లించమని డిమాండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా చూడని కుటుంబ ప్రేక్షకులకు అదనంగా మరో 100 చెల్లించడం పెద్ద ఇబ్బంది కాదంటున్నాయి ఓటీటీ సంస్థలు. వంద రూపాయలు కడితే, ఇంట్లోనే ఇంటిల్లిపాదీ, హెచ్ డీ క్వాలిటీలో సినిమా చూడొద్దని ఊరిస్తున్నాయి. అదీ నిజమే.

First Published:  16 May 2022 4:19 PM IST
Next Story