Telugu Global
NEWS

మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మెట్లెక్కిన నారాయణ కూతుళ్లు, అల్లుడు..

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ఎపిసోడ్ లో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశముండటంతో.. నారాయణ కూతుళ్లు, అల్లుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తమని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, ముందస్తు బెయిల్ కావాలని కోర్టుని ఆశ్రయించారు. ఆదివారం అయినా అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. కోర్టు వారి పిటిషన్ పై విచారణ జరిపి ఈనెల 18 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పూర్తిస్థాయి […]

మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మెట్లెక్కిన నారాయణ కూతుళ్లు, అల్లుడు..
X

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ఎపిసోడ్ లో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశముండటంతో.. నారాయణ కూతుళ్లు, అల్లుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తమని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, ముందస్తు బెయిల్ కావాలని కోర్టుని ఆశ్రయించారు. ఆదివారం అయినా అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. కోర్టు వారి పిటిషన్ పై విచారణ జరిపి ఈనెల 18 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పూర్తిస్థాయి విచారణను కూడా అదేరోజు చేపట్టబోతున్నట్టు తెలిపింది.

నారాయణ చైర్మన్ కాకపోతే ఇంకెవరు..?
నారాయణ విద్యాసంస్థల ప్రోద్బలంతోనే.. ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరికొంతమంది పేపర్ ని ఫొటోలు తీసి బయటకు పంపించారు. మాల్ ప్రాక్టీస్ కు సహకరించారు. దీన్ని ఛేదించిన చిత్తూరు జిల్లా పోలీసులు మాల్ ప్రాక్టీస్ ని అడ్డుకున్నామని చెప్పారు. దానికి కారణమైనవారిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ తర్వాత మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. అయితే నారాయణ, ఆ విద్యాసంస్థల చైర్మన్ కాదని, 2014లోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారని, ఆయన అరెస్ట్ సరికాదని మేజిస్ట్రేట్ ముందు నారాయణ తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది.

కథ ఇక్కడితో ఆయిపోలేదు. నారాయణ చైర్మన్ కాకపోతే మరి చైర్మన్ ఎవరు..? ఆ స్థానంలో ఉన్నవారిని బాధ్యులుగా చేస్తూ కేసు విచారణ ముందుకు సాగాలి కదా..? ఈ దశలో కేసు విచారణ మరో మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో.. నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్ తోపాటు విద్యాసంస్థలల్లో పనిచేసే మరో 10మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

మేం నిందితులం కాము.. కానీ బెయిల్ కావాలి..
పోలీసులు నమోదు చేసిన కేసులో వారిని నిందితులుగా పేర్కొనలేదు. కానీ వారు ముందు జాగ్రత్తగా బెయిల్ కోరారు. పోలీసుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొనలేదు కాబట్టి.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తే నష్టం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నెల 18వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.

First Published:  16 May 2022 3:00 AM IST
Next Story