కోర్టులో లొంగిపోయిన బ్యాంకు ఉద్యోగి
వనస్థలీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి 22లక్షల 53 వేల రూపాయలతో పారిపోయిన క్యాషియర్ ప్రవీణ్ సోమవారం రంగారెడ్డి కోర్టులో లొంగిపోయాడు. మే 10న బ్యాంకు నుంచి నగదు తీసుకొని ప్రవీణ్ పారిపోయాడు. బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ అభ్యర్థన మేరకు పోలీసులు ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో ఆ సొమ్ము మొత్తాన్ని ప్రవీణ్ కోల్పోయినట్టు పోలీసు విచారణలో తేలింది. అయితే రెండు రోజులుగా పరారీలో ఉన్న ప్రవీణ్ ఓ సెల్ఫీ […]
వనస్థలీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి 22లక్షల 53 వేల రూపాయలతో పారిపోయిన క్యాషియర్ ప్రవీణ్ సోమవారం రంగారెడ్డి కోర్టులో లొంగిపోయాడు. మే 10న బ్యాంకు నుంచి నగదు తీసుకొని ప్రవీణ్ పారిపోయాడు. బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ అభ్యర్థన మేరకు పోలీసులు ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో ఆ సొమ్ము మొత్తాన్ని ప్రవీణ్ కోల్పోయినట్టు పోలీసు విచారణలో తేలింది.
అయితే రెండు రోజులుగా పరారీలో ఉన్న ప్రవీణ్ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు. తాను బ్యాంకు నుండి సొమ్మును దొంగతనం చేయలేదని, ఇది బ్యాంకు మేనేజర్ కుట్ర అని ఆ వీడియోలో ప్రవీణ్ పేర్కొన్నాడు.
వనస్థలిపురం సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో క్యాషియర్ గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ మే 10వ తేదీన మధ్యాహ్నం తనకు కడుపు నొప్పిగా ఉందని మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తానని మేనేజర్ కు చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ సాయంత్రం క్యాష్ లెక్కించగా 22 లక్షల 53 వేల నగదు తక్కువగా వచ్చింది. దాంతో డబ్బు తీసుకొని ప్రవీణ్ కుమార్ పరారయ్యాడని మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.