Telugu Global
NEWS

దత్త పుత్రా.. ఆరోజు ప్రశ్నించలేదేం..?

ఇటీవల చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారని, కానీ.. సీసీఆర్సీ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకూ పరిహారం అందలేదని నిరూపించలేకపోయారని అన్నారు సీఎం జగన్. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్, మరోసారి చంద్రబాబు, […]

దత్త పుత్రా.. ఆరోజు ప్రశ్నించలేదేం..?
X

ఇటీవల చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారని, కానీ.. సీసీఆర్సీ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకూ పరిహారం అందలేదని నిరూపించలేకపోయారని అన్నారు సీఎం జగన్. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్, మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు.

రైతు భరోసా పథకం గతంలో లేదని, మూడేళ్లలో 50లక్షలమందికి పైగా రైతులకు రైతు భరోసా అందించామని, రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతులకు ఇంతగా సాయం చేసిన ప్రభుత్వం చరిత్రలోనే లేదన్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదని, అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు జగన్.

తమ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష లేదని, తమకు ఓటు వేసినా వేయకపోయినా అందరికీ మంచే చేస్తున్నామని, కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నామని అన్నారు జగన్. మూడేళ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు జగన్. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16లక్షల టన్నులు పెరిగిందని, రైతులకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ.1,282 కోట్లు అందజేశామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం అందిందని, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రాద్ధాంతం చేస్తున్నట్టు పరిహారం అందనివారెవరూ లేరని స్పష్టం చేశారు జగన్. ఎన్నికల్లో రైతులకిచ్చిన మాట తప్పిన చంద్రబాబు లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా అని ప్రజల్ని ప్రశ్నించారు జగన్.

First Published:  16 May 2022 7:56 AM IST
Next Story