సెంచరీ కొట్టిన టమోటా.. రేటు మరింత పెరిగే ఛాన్స్..
నెలరోజుల వ్యవధిలోనే టమోటా రేటు విపరీతంగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పంట మార్కెట్ కి రాకపోవడంతో.. రేటు పెరుగుతుందని వ్యాపారులు ముందే ఊహించారు. నెలరోజుల క్రితం 20నుంచి 30 రూపాయల మధ్య ఉన్న టమోటా రేటు ఇప్పుడు 100 రూపాయలకు చేరుకుంది. మదనపల్లె హోల్ సేల్ మార్కెట్ లో రేటు కేజీ 70 రూపాయలకు చేరింది. ఇక బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో.. సూపర్ మార్కెట్లలో ఫస్ట్ క్వాలిటీ సరుకు అంటూ కేజీ టమోటాను 150 రూపాయలకు […]
నెలరోజుల వ్యవధిలోనే టమోటా రేటు విపరీతంగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పంట మార్కెట్ కి రాకపోవడంతో.. రేటు పెరుగుతుందని వ్యాపారులు ముందే ఊహించారు. నెలరోజుల క్రితం 20నుంచి 30 రూపాయల మధ్య ఉన్న టమోటా రేటు ఇప్పుడు 100 రూపాయలకు చేరుకుంది. మదనపల్లె హోల్ సేల్ మార్కెట్ లో రేటు కేజీ 70 రూపాయలకు చేరింది. ఇక బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో.. సూపర్ మార్కెట్లలో ఫస్ట్ క్వాలిటీ సరుకు అంటూ కేజీ టమోటాను 150 రూపాయలకు అంటగడుతున్నారు.
ఎందుకిలా..?
ప్రస్తుతం మార్కట్లో స్టాక్ లేదు, పంట కూడా లేదు. అంటే మరో రెండు నెలలపాటు టమోటా రేటు పెరగడమే కానీ, తగ్గే ఛాన్స్ లేదు. దీంతో ఉన్న సరుకుకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. రేటు అమాంతం కొండెక్కి కూర్చుంది. కరోనా సమయంలో ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేక టమోటా వేసిన రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. లాక్ డౌన్ నిబంధనలతో ఇటీవల టమోటా వినియోగం కూడా తగ్గడంతో.. దానికి తగ్గట్టే.. ఉత్పత్తి కూడా కావాలనే తగ్గించారు. ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా రైతుల్లో మాత్రం ఆ భయం పోలేదు. అందుకే గతంలో లాగా టమోటా పంట వేయడంలేదు. ఇటీవల ఫోర్త్ వేవ్ అంటూ మరో భయం మొదలైంది. దీంతో మరింత వెనకాడారు. దాని ఫలితమే ఇది.
టమోటా రేటు పెరిగింది, మరింత పెరుగుతుందని తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మహా అయితే సగటు మధ్యతరగతి మనిషి.. మరో కిలో అదనంగా కొనుగోలు చేస్తాడే కానీ అంతకంటే నిల్వ చేసుకునే ఉపాయం కూడా లేదు. మరోవైపు టమోటా తప్పనిసరిగా వాడే వంటల్లో కూడా మార్పులొచ్చేస్తున్నాయి. ఇటీవల నిమ్మకాయల రేట్లు పెరగడంతో.. కొన్ని హోటళ్లలో బిర్యానీతోపాటు నిమ్మకాయ ముక్కలు వేయడం మానేశారు. ఇప్పుడు టమోటా వాడకం కూడా హోటళ్లలో తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. మరో రెండు నెలలపాటు టమోటా రేటు తగ్గేదే లేదని అంటున్నారు.