Telugu Global
NEWS

భారత బ్యాడ్మింటన్ బంగారు చరిత్ర.. భారత్ చేతిలో ఎట్టకేలకు థామస్‌ కప్!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే థామస్ కప్ ను భారత పురుషుల జట్టు తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించింది. బంగారు పతకం అందుకోడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీసింది. బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2022 థామస్ కప్ ఫైనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇండోనీసియాను 3-0తో మట్టికరిపించింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ తో జరిగే ఈ టీమ్ సమరంలో జర్మనీ, డెన్మార్క్, మలేసియా లాంటి మేటిజట్లను చిత్తు చేయడం ద్వారా గోల్డ్ మెడల్ […]

భారత బ్యాడ్మింటన్ బంగారు చరిత్ర.. భారత్ చేతిలో ఎట్టకేలకు థామస్‌ కప్!
X

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే థామస్ కప్ ను భారత పురుషుల జట్టు తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించింది. బంగారు పతకం అందుకోడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీసింది. బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2022 థామస్ కప్ ఫైనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇండోనీసియాను 3-0తో మట్టికరిపించింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ తో జరిగే ఈ టీమ్ సమరంలో జర్మనీ, డెన్మార్క్, మలేసియా లాంటి మేటిజట్లను చిత్తు చేయడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్లో నిలిచిన భారత్ కు ఎదురేలేకపోయింది. భారత్ విజయంలో తెలుగు తేజాలు కిడాంబీ శ్రీకాంత్, సాత్విక్ తమవంతు పాత్ర నిర్వర్తించడం విశేషం.

లక్ష్యసేన్ గెలుపుతో బోణీ..
ప్రారంభ సింగిల్స్ లో భారతయువ ఆటగాడు లక్ష్యసేన్ గెలుపుతో భారతజట్టు జైత్రయాత్రను మొదలు పెట్టింది. 1-0 ఆధిక్యంతో కీలక డబుల్స్ బరిలోకి దిగిన భారతజట్టు తుదివరకూ పోరాడి టైటిల్ కు మార్గం సుగమం చేసింది. సాత్విక్- చిరాగ్ జోడీ 18-21, 23-21, 21-19తో డబుల్స్ పోరులో సంచలన విజయం సాధించారు. నిర్ణయాత్మక రెండో సింగిల్స్ సమరంలో తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ 21-15, 23-21తో ఇండోనీసియా ఆటగాడు జోనాథన్ క్రిస్టీని ఓడించడం ద్వారా తనజట్టు థామస్ కప్ తో పాటు బంగారు పతకాన్ని అందించాడు. 1949లో ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌లో భారత్‌ ఫైనల్ చేరడం, బంగారు పతకం గెలుచుకోడం ఇదే మొదటిసారి. మహిళల టీమ్ విభాగంలో 22014, 2016 టోర్నీలలో కాంస్య పతకాలు సాధించిన భారత్‌ థామస్ కప్ లో మాత్రం స్వర్ణ పతకం సాధించడం ద్వారా అరుదైన ఘనతను సాధించగలిగింది. ఇప్పటి వరకూ చైనా, మలేసియా, ఇండోనీసియా, డెన్మార్క్ లాంటి జట్లు మాత్రమే థామస్ కప్ ను గెలుచుకొంటూ వచ్చాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకిదిగిన భారత పురుషుల జట్టు సాధించిన అతిపెద్ద విజయం ఇదే.

First Published:  15 May 2022 11:46 AM IST
Next Story