ఇన్నాళ్లకు సత్యహరిశ్చంద్రుడికి వ్యతిరేకి దొరికాడు..
పురాణాల్లో నిజం చెప్పే వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు అని, అప్పట్లో ఆయనకి పూర్తి వ్యతిరేక స్వభావం ఉన్న వ్యక్తి ఎవరూ దొరకలేదని, కానీ ఈ యుగంలో చంద్రబాబు దొరికాడని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. నిద్రలేస్తే అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు ఆని ఆయన విమర్శించారు. తన జీవిత కాలంలో చంద్రబాబు ఇప్పటి వరకూ ఒక్క నిజం కూడా చెప్పలేదని అన్నారు అంబటి రాంబాబు. గడప గడపకు అపూర్వ స్పందన.. ఎన్నికలకు ముందు తమ నాయకుడు జగన్ […]
పురాణాల్లో నిజం చెప్పే వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు అని, అప్పట్లో ఆయనకి పూర్తి వ్యతిరేక స్వభావం ఉన్న వ్యక్తి ఎవరూ దొరకలేదని, కానీ ఈ యుగంలో చంద్రబాబు దొరికాడని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. నిద్రలేస్తే అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు ఆని ఆయన విమర్శించారు. తన జీవిత కాలంలో చంద్రబాబు ఇప్పటి వరకూ ఒక్క నిజం కూడా చెప్పలేదని అన్నారు అంబటి రాంబాబు.
గడప గడపకు అపూర్వ స్పందన..
ఎన్నికలకు ముందు తమ నాయకుడు జగన్ ఆదేశాలతో ప్రతి ఇంటికి వెళ్లి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని వివరించామని, ఇప్పుడు చేసి చూపిస్తున్నామని అన్నారు అంబటి రాంబాబు. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ ఆదేశాలతో గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఆరోజు వెళ్లాం, ఈరోజు వెళ్తున్నాం, భవిష్యత్ లోనూ ప్రతి ఇంటికీ వెళ్తామని అన్నారాయన. ప్రతి ఇంటికి ధైర్యంగా వెళ్లి చేసింది చెప్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి ఏయే సంక్షేమ పథకాలు అందాయో చెబుతున్నామని, మూడేళ్ళలో ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రింటెడ్ గా ఇస్తున్నామని అన్నారు. ఈ దేశం మొత్తమ్మీద చెప్పింది చేశామని ప్రజల వద్దకు వెళుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు రాంబాబు. మేనిఫెస్టోలోని 95శాతం హామీలను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వం అని, మేనిఫెస్టోను దాచేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు అంబటి రాంబాబు.
ప్రజలు తమ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతుంటే.. చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోవడంలేదని, ప్రజా వ్యతిరేకత ఉందంటూ తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ.. అన్ని పార్టీల కార్యకర్తల ఇళ్లకు తాము వెళ్తున్నామని చెప్పారు. చంద్రబాబు చివరి రెండేళ్ళు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బాకీ పెట్టి వెళ్లారని, దాన్ని జగన్ చెల్లించారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ బకాయిలు పెడితే ఆ బాకీని కూడా తామే తీర్చామన్నారు. గడప గడపకు వెళ్లి తాము ప్రజా బ్యాలెట్ ఇస్తున్నామని, 50 ప్రశ్నలకు ప్రజలే సమాధానం ఇచ్చేలా బ్యాలెట్ ను రూపొందించామని, తాము వెళ్ళినప్పుడు ప్రజల ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు అంబటి రాంబాబు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనుకున్నదానికంటే విజయవంతం అవుతోందని చెప్పారు.