Telugu Global
NEWS

ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీకి షాక్.. జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం..

స్కూటర్లు, బైక్ లు వారంటీ ఉన్న సమయంలో సరిగా పనిచేయకపోతే కంపెనీ ఉచితంగా రిపేర్ చేసి ఇస్తుంది. దాదాపుగా వారంటీ పీరియడ్ లో ఎక్కడా ఎలాంటి సమస్యలు రావు, ఒకవేళ వచ్చినా కంపెనీయే ఖర్చు భరిస్తుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఏ కంపెనీతోనూ ఎవరికీ పెద్దగా సమస్యలు కేవు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో సమస్యలొస్తే అటు కంపెనీ పట్టించుకోవట్లేదు, ఇటు ఏజెన్సీ కూడా మొహం చాటేస్తోంది. మీ మెయింటెనెన్స్ బాలేదు అని సింపుల్ గా […]

ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీకి షాక్.. జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం..
X

స్కూటర్లు, బైక్ లు వారంటీ ఉన్న సమయంలో సరిగా పనిచేయకపోతే కంపెనీ ఉచితంగా రిపేర్ చేసి ఇస్తుంది. దాదాపుగా వారంటీ పీరియడ్ లో ఎక్కడా ఎలాంటి సమస్యలు రావు, ఒకవేళ వచ్చినా కంపెనీయే ఖర్చు భరిస్తుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఏ కంపెనీతోనూ ఎవరికీ పెద్దగా సమస్యలు కేవు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో సమస్యలొస్తే అటు కంపెనీ పట్టించుకోవట్లేదు, ఇటు ఏజెన్సీ కూడా మొహం చాటేస్తోంది. మీ మెయింటెనెన్స్ బాలేదు అని సింపుల్ గా చెప్పి తప్పించుకుంటారు. దాదాపుగా ఇది చాలామందికి అనుభవంలో ఉన్న విషయమే. అయితే హైదరాబాద్ కి చెందిన ఓమహిళ దాదాపు మూడేళ్లపాటు పోరాటం చేసి వినియోగదారుల ఫోరంలో కేసు గెలిచారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి జరిమానా విధించేలా చేశారు.

ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీకి జరిమానా విధించింది. ఆ ప్రమాదాలకు ఈ జరిమానాకు సంబంధం లేకపోయినా.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని ఆకర్షించి, భద్రతా ప్రమాణాలను అందుకోలేని నాసిరకం స్కూటర్లను అంటగట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీలకు ఇది నిజంగా షాకే.

2018లో హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ ఒకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని 65వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఏడాదిలోగా స్కూటర్ రిపేర్ కి వచ్చింది. కంపెనీ చెప్పినట్టుగా బ్యాటరీ పనిచేయట్లేదు. ఒకసారి చార్జింగ్ తో నిరంతరాయంగా 200 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ హామీ ఇచ్చినా.. 60నుంచి 65 కిలోమీటర్లు తిరిగేలోగా బ్యాటరీ డిశ్చార్జి అయిపోతోంది. 25 కిలోమీటర్ల స్పీడ్ దాటితే స్పీడోమీటర్ రీడింగ్ తప్పు చూపిస్తోంది. డిస్క్ బ్రేక్ లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఆమె ఏజెన్సీని సంప్రదించగా వారు స్పందించలేదు, కంపెనీకి కంప్లయింట్ చేసినా ఫలితం లేదు. ఆ తర్వాత ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూటర్ ని రిపేర్ చేయించాల్సి వస్తోందని, తనకు న్యాయం చేయాలని కోరింది.

కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 198 ప్రకారం వినియోగదారు ఫోరం స్కూటర్ రేటులో 90శాతాన్ని తిరిగి కస్టమర్ కి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా 15వేల రూపాయలు పరిహారం చెల్లించాలని సూచించింది. అయితే కమిషన్ ఆదేశాలపై బాలాజీ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ సంస్థ స్పందించలేదు. ఒకినావా మాత్రం తమ కంపెనీ పరువు తీయడానికి ఇలా అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంది. ఇదే కంపెనీ ఇటీవల అగ్నిప్రమాద ఘటనల తర్వాత 3వేల స్కూటర్లను రీకాల్ చేయడం విశేషం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న వేళ.. ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరింతమంది ఎలక్ట్రిక్ స్కూటర్ల బాధితులకు ధైర్యాన్నిచ్చింది.

First Published:  14 May 2022 3:33 AM GMT
Next Story