Telugu Global
Cinema & Entertainment

పార్టీ చేసుకున్న సర్కారువారి పాట టీమ్

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఓవరాల్ గా సినిమా హిట్టయింది. దీంతో యూనిట్ పార్టీ చేసుకుంది. నిన్న రాత్రి నిర్మాతలు కొంతమందికి పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి హీరో మహేష్ బాబు కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో వర్క్ చేస్తున్న దర్శకులు, త్వరలోనే వర్క్ చేయబోతున్న డైరక్టర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. వీళ్లతో పాటు దిల్ రాజు లాంటి సినీ […]

పార్టీ చేసుకున్న సర్కారువారి పాట టీమ్
X

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఓవరాల్ గా సినిమా హిట్టయింది. దీంతో యూనిట్ పార్టీ చేసుకుంది. నిన్న రాత్రి నిర్మాతలు కొంతమందికి పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి హీరో మహేష్ బాబు కూడా హాజరయ్యాడు.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో వర్క్ చేస్తున్న దర్శకులు, త్వరలోనే వర్క్ చేయబోతున్న డైరక్టర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. వీళ్లతో పాటు దిల్ రాజు లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ పార్టీకి వచ్చారు. పార్టీలో మహేష్ బాబు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలవగా.. అంతా కలిసి పరశురామ్ ను మెచ్చుకున్నారు.

అయితే ఈ పార్టీకి హీరోయిన్ కీర్తిసురేష్, మ్యూజిక్ డైరక్టర్ తమన్ రాలేదు. శృతిహాసన్ వేరే షూటింగ్ లో ఉండడం వల్ల హాజరుకాలేకపోయింది. తమన్ హైదరాబాద్ లోనే ఉండి కూడా రాలేదనే ప్రచారం జరుగుతోంది. తమన్ ఎందుకు ఈ పార్టీకి దూరమయ్యాడనేది చర్చనీయాంశమైంది.

గీతగోవిందం లాంటి సక్సెస్ తర్వాత చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని, సర్కారువారి పాట స్టోరీ రాసుకున్నాడు పరశురామ్. దీని కోసం అతడు చాలా రీసెర్చ్ చేశాడు. ఎంతోమంది బ్యాంకింగ్ నిపుణులతో మాట్లాడాడు. అలా తన సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, సందేశాత్మకంగా కూడా మార్చాడు. అది ఆడియన్స్ కు బాగా నచ్చింది.

First Published:  14 May 2022 1:05 PM IST
Next Story