Telugu Global
NEWS

హైదరాబాద్ లో మద్యం అమ్మకాలపై కొత్త నిబంధనలు..

హైదరాబాద్ నగరంలో మద్యం అమ్మకాలు, బార్లు, పబ్బుల నిర్వహణపై పోలీసులు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. ఇకపై హైదరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులలో రాత్రి 11 తర్వాత మద్యం ఆర్డర్ ఇవ్వకూడదు. 12గంటలకు కచ్చితంగా బార్లు, పబ్బులు మూసివేయాల్సిందే. వీకెండ్స్ లో అరగంట గ్రేస్ పీరియడ్, గంట సేపు మినహాయింపు ఉంటుంది. ఇకపై ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డ్రైవ్ […]

హైదరాబాద్ లో మద్యం అమ్మకాలపై కొత్త నిబంధనలు..
X

హైదరాబాద్ నగరంలో మద్యం అమ్మకాలు, బార్లు, పబ్బుల నిర్వహణపై పోలీసులు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. ఇకపై హైదరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులలో రాత్రి 11 తర్వాత మద్యం ఆర్డర్ ఇవ్వకూడదు. 12గంటలకు కచ్చితంగా బార్లు, పబ్బులు మూసివేయాల్సిందే. వీకెండ్స్ లో అరగంట గ్రేస్ పీరియడ్, గంట సేపు మినహాయింపు ఉంటుంది. ఇకపై ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో ఆయన ఓ సమావేశం ఏర్పాటు చేసి, కొత్త నిబంధనలను వివరించారు.

మినహాయింపులు వీటికే..
అంతర్జాతీయ ప్రయాణికులను, ప్రతినిధులను పరిగణలోకి తీసుకుని.. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో మాత్రమే 24 గంటల మద్యం సరఫరాకు అనుమతి ఉంది. అది కూడా సాధారణ ప్రజలకు కాదని, హోటల్ లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌ కు అపఖ్యాతి తీసుకురావద్దని ఆయన బార్లు, పబ్బుల యజమానులకు సూచించారు.

పుడింగ్ అండ్ మింక్ పబ్ ఉదంతం తర్వాత..
ఇటీవల హైదరాబాద్ లో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో మరోసారి భాగ్యనగరం పేరు చర్చకు వచ్చింది. హైదరాబాద్ కి ఉన్న ఇమేజ్ ని ఇలా డ్యామేజీ చేయడం సరికాదన్నారు కమిషనర్ సీవీ ఆనంద్. చిన్న చిన్న లాభాలకోసం ఆశపడి డ్రగ్స్ తీసుకు రావొద్దని, ఆ తర్వాత చిక్కుల్లో పడొద్దని పబ్బులు, బార్ల యజమానులకు సూచించారు. పబ్బులు, బార్ల నుంచి వచ్చే సౌండ్ లు పరిమితి స్థాయి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. సీసీ కెమెరాలకు సంబంధించిన 30 రోజుల బ్యాకప్‌ తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి, చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు కమిషనర్ సీవీ ఆనంద్.

First Published:  14 May 2022 6:14 AM IST
Next Story