Telugu Global
NEWS

హైదరాబాద్ తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..

హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా సుంకిశాల ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌ టెక్ వెల్ ప‌నుల‌కు ఆయన శంకుస్థాప‌న చేశారు. సుంకిశాల‌లో 1450 కోట్ల రూపాయల అంచ‌నా వ్య‌యంతో తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అద‌నంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయ‌డానికి ప‌నులు చేప‌డుతున్నట్టు ఆయన వెల్లడించారు. రాబోయే వేసవి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు […]

హైదరాబాద్ తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..
X

హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా సుంకిశాల ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌ టెక్ వెల్ ప‌నుల‌కు ఆయన శంకుస్థాప‌న చేశారు. సుంకిశాల‌లో 1450 కోట్ల రూపాయల అంచ‌నా వ్య‌యంతో తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అద‌నంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయ‌డానికి ప‌నులు చేప‌డుతున్నట్టు ఆయన వెల్లడించారు. రాబోయే వేసవి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

2072వరకు తాగునీటికి ఇబ్బంది లేదు..
పెరుగుతున్న హైదరాబాద్ తాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి సుంకిశాల పనులు మొదలు పెట్టామంటున్నారు కేటీఆర్. వరుస‌గా ఏడేళ్లపాటు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుత‌ హైద‌రాబాద్‌ ప్రజలకు 37 టీఎంసీల నీరు అవసరం ఉందని, 2072 నాటికి ఇది పెరిగి మ‌రో 34 టీఎంసీల అవ‌స‌రం ఉంటుందని చెప్పారు కేటీఆర్. 2072నాటికి హైదరాబాద్ ప్రజలకు దాదాపు 71 టీఎంసీల నీరు అవ‌స‌రం ఉంటుందని అంచనా వేశారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవ‌స‌రం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 2072 లో కూడా హైదరాబాద్ కి నీటి ఎద్దడి ఉండదని చెప్పారు కేటీఆర్.

నగరం 100కిలోమీటర్లు విస్తరించినా..
హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోందని.. నగరం ఇంకో 100 కిలోమీటర్లు విస్తరించినా నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పారు కేటీఆర్. హైద‌రాబాద్ చుట్టూ వాట‌ర్ పైప్ లైన్లు ఏర్పాటు చేశామని, ఔటర్ రింగ్ రోడ్డుకి బయట, లోపల ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌న్నారు. మెట్రో వాట‌ర్ స‌ప్లై, సీవ‌రేజ్ బోర్డు ఆధ్వ‌ర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయన్నారు కేటీఆర్.

First Published:  14 May 2022 7:39 AM IST
Next Story