జస్టిస్ సత్యనారాయణమూర్తి, రాకేష్‌కుమార్‌లకు కీలక బాధ్యతలు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణతో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పలు కీలకమైన వ్యాఖ్యలు, తీర్పులు ఇచ్చి రిటైర్ అయిన జస్టిస్ రాకేష్‌కుమార్‌ను కూడా జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో సభ్యుడిగా నియమించారు. రాకేష్ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు కారణమయ్యాయి. […]
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణతో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పలు కీలకమైన వ్యాఖ్యలు, తీర్పులు ఇచ్చి రిటైర్ అయిన జస్టిస్ రాకేష్‌కుమార్‌ను కూడా జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో సభ్యుడిగా నియమించారు. రాకేష్ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు కారణమయ్యాయి.
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని, పాలనను కేంద్రానికి అప్పగించాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం తెలిపింది. అయితే తాను అలా అనలేదని.. అని ఉంటే ఆధారాలు చూపాలంటూ రాకేష్ కుమార్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. పదవి విరమణ రోజు జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు అమరావతి రైతులు రోడ్డుకు ఇరువైపుల నిలబడి వీడ్కోలు పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
జస్టిస్ సత్యనారాయణమూర్తి మచిలీపట్నానికి చెందిన వారు. జూన్13న ఆయన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయనున్నారు. తాజాగా ట్రైబ్యునల్ న్యాయ సభ్యుడిగా నియమితులైన సత్యనారాయణమూర్తి.. ఆ పదవిలో నాలుగేళ్ల పాటు లేదా 67 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం ప్రకటించింది.
జస్టిస్ సత్యనారాయణమూర్తి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల కాలంలో ఇచ్చిన పలు తీర్పులు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేసిన వారి జాబితాలో సత్యనారాయణ మూర్తి పేరు కూడా ఉంది. సత్యనారాయణ మూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తి అని కూడా గతంలో జగన్ తన లేఖలో వ్యాఖ్యానించారు.