Telugu Global
National

ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య..

ఢిల్లీలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 27మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. 30మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 50మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే మరో 30మంది ఆచూకీ గల్లంతయినట్టు తెలుస్తోంది. వారు తప్పించుకుని వెళ్లిపోయారా, లేక మంటల్లో చిక్కుకుని కాలిపోయారా.. అనేది తేలాల్సి ఉంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్ అది. మూడంతస్తుల ఆ బిల్డింగ్ లో దాదాపుగా ఓ 30వరకు […]

ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య..
X

ఢిల్లీలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 27మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. 30మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 50మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే మరో 30మంది ఆచూకీ గల్లంతయినట్టు తెలుస్తోంది. వారు తప్పించుకుని వెళ్లిపోయారా, లేక మంటల్లో చిక్కుకుని కాలిపోయారా.. అనేది తేలాల్సి ఉంది.

పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్ అది. మూడంతస్తుల ఆ బిల్డింగ్ లో దాదాపుగా ఓ 30వరకు చిన్నా చితకా ఆఫీస్ లు ఉన్నాయి. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం. అగ్నిమాపక నిబంధనలు ఏమాత్రం పాటించలేదని బిల్డింగ్ ని చూస్తే అర్థమవుతుంది. కానీ అధికారుల అలసత్వం, నాయకుల నిర్లక్ష్యం.. తో అలాంటి బిల్డింగ్ లవైపు ఎవ్వరూ కన్నెత్తి చూడటంలేదు. ప్రమాదం అని తెలిసినా కూడా ఇలాంటి చోట్ల వ్యాపారాలు ఆగడంలేదు. తీరా ప్రమాదం జరిగినప్పుడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం మాత్రం రివాజుగా మారింది. 24 ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పుతున్నా పరిస్థితి అదుపులోకి రాలేదంటే ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకే ఒక్క మార్గం ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టినా మృతుల సంఖ్య మాత్రం పెరిగింది.

షార్ట్ సర్క్యూటే కారణం.. నిర్లక్ష్యంతో ప్రమాదం..
సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ కార్యాలయంలో మొదటగా మంటల్ని గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చినట్టు నిర్థారణకు వచ్చారు. ఈ కార్యాలయం మొదటి అంతస్తులో ఉండటంతో.. వెంటనే మంటలు పైకి వ్యాపించాయి. నిముషాల వ్యవధిలోనే మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించడం సాధ్యం కాకపోవడంతో.. ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 తక్షణ పరిహారంగా కేంద్రం ప్రకటించింది.

First Published:  13 May 2022 11:01 PM GMT
Next Story