Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 సినిమాలో కీలకం ఎవరో తెలుసా?

ఎఫ్3 సినిమాలో వెంకటేష్ ఉన్నాడు, వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలు వీళ్లిద్దర్లో ఒకరిది అయి ఉంటుంది. ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ ఎఫ్3 సినిమాలో కథను మలుపుతిప్పే కీలక పాత్ర వీళ్లది కాదు. ఆ అవకాశాన్ని తమన్న అందుకుంది. ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 కథ మొత్తం హారిక […]

ఎఫ్3 సినిమాలో కీలకం ఎవరో తెలుసా?
X

ఎఫ్3 సినిమాలో వెంకటేష్ ఉన్నాడు, వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలు వీళ్లిద్దర్లో ఒకరిది అయి ఉంటుంది. ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ ఎఫ్3 సినిమాలో కథను మలుపుతిప్పే కీలక పాత్ర వీళ్లది కాదు. ఆ అవకాశాన్ని తమన్న అందుకుంది.

ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. నటనకి ఆస్కారం వున్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. వెంకటేష్- తమన్నా ల మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి.

”మన ఆశలే మన విలువలు” ఎఫ్3 లో తమన్నా హారిక పాత్ర చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా ఉంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథ మలుపు తిరుగుతుంది. ఇదే సినిమాలో పెద్ద ట్విస్ట్.

తాజాగా రిలీజైన ఎఫ్3 ట్రయిలర్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. దీంతో పాటు రేచీకటి పాత్రలో వెంకటేష్, నత్తి వున్న పాత్రలో వరుణ్ తేజ్ కామెడీ పంచ్ లు హైలెట్ గా నిలిచాయి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, రఘుబాబు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

First Published:  13 May 2022 2:55 PM IST
Next Story