Telugu Global
National

ఒక కుటుంబంలో ఒకరికే టికెట్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం..

కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళణ దిశగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ నిర్వహిస్తున్న పార్టీ అధినేతలు.. తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక కుటుంబానికి సంబంధించి ఒకరికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండేలా, ఒక్కరికి మాత్రమే టికెట్ ఇచ్చేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. రెండో వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వాలంటే.. కనీసం ఐదేళ్లపాటు వారు పార్టీలో ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా ఇదే రూల్. ఐదేళ్లపాటు పార్టీలో […]

ఒక కుటుంబంలో ఒకరికే టికెట్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం..
X

కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళణ దిశగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ నిర్వహిస్తున్న పార్టీ అధినేతలు.. తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక కుటుంబానికి సంబంధించి ఒకరికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండేలా, ఒక్కరికి మాత్రమే టికెట్ ఇచ్చేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. రెండో వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వాలంటే.. కనీసం ఐదేళ్లపాటు వారు పార్టీలో ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కూడా ఇదే రూల్. ఐదేళ్లపాటు పార్టీలో సంస్థాగతంగా పనిచేసిన వారికే టికెట్ ఇచ్చేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు..
చింతన్ శిబిర్ తొలిరోజున బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీకోసమే కాకుండా, దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు.

2024 ఎన్నికలే లక్ష్యం..
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు పనిచేయాలని సూచించారు సోనియా గాంధీ. ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనల్లో చాలా విషయాలను ఈ చింతన్ శిబిర్ లో చర్చిస్తారని తెలుస్తోంది. పీకేని పార్టీలో చేర్చుకోకపోయినా ఆయన చెప్పిన మార్పుల్ని మాత్రం పార్టీ స్వీకరించేలా కనిపిస్తోంది. ఇక ముగింపు రోజు రాహుల్ గాంధీ కీలకోపన్యాసం ఇస్తారు. పార్టీలోని వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్‌ బేరర్లు, ఇతర నేతలు అందరూ కలిపి.. 422 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులపై కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసింది. ఆ కమిటీలు పలు తీర్మానాలు రూపొందించాయి. చింతన్ శిబిర్ చివరి రోజున ఆదివారం.. ఆ తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది.

First Published:  13 May 2022 1:45 PM IST
Next Story