Telugu Global
National

మత మార్పిడికి తహసీల్దార్ అనుమతి- కర్నాటక ఆర్డినెన్స్

కర్నాటక ప్రభుత్వం మత మార్పిడిలను అడ్డుకునేందుకు కొత్త ఆర్డినెన్స్ తీసుకొస్తోంది. శాసనసభలో మెజారిటీ ఉన్నప్పటికీ.. మండలిలో బీజేపీకి మెజారిటీ లేకపోవడం బిల్లు ఆమోదం పొందే అవకాశాలు లేవు. దాంతో బసవరాజ బొమ్మై ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. మత మార్పిడి నిషేధం పేరుతో కాకుండా మత స్వేచ్చ పరిరక్షణ చట్టం పేరిట దీన్ని తెస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. డబ్బు, ఉపాధి, ఉద్యోగం, వివాహం, లగ్జరి జీవితం వంటి వాటిని ఎరగా చూపి మత మార్పిడిలకు పాల్పలకూడదు. […]

మత మార్పిడికి తహసీల్దార్ అనుమతి- కర్నాటక ఆర్డినెన్స్
X

కర్నాటక ప్రభుత్వం మత మార్పిడిలను అడ్డుకునేందుకు కొత్త ఆర్డినెన్స్ తీసుకొస్తోంది. శాసనసభలో మెజారిటీ ఉన్నప్పటికీ.. మండలిలో బీజేపీకి మెజారిటీ లేకపోవడం బిల్లు ఆమోదం పొందే అవకాశాలు లేవు. దాంతో బసవరాజ బొమ్మై ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది.

మత మార్పిడి నిషేధం పేరుతో కాకుండా మత స్వేచ్చ పరిరక్షణ చట్టం పేరిట దీన్ని తెస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. డబ్బు, ఉపాధి, ఉద్యోగం, వివాహం, లగ్జరి జీవితం వంటి వాటిని ఎరగా చూపి మత మార్పిడిలకు పాల్పలకూడదు. అలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

మహిళలు, మైనర్లు,ఎస్సీ,ఎస్టీలను గ్రూపులుగా మతం మారేలా చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్షకు అవకాశం ఉంది. పెళ్లి కోసం మతాన్ని మారిస్తే ఆ వివాహం చెల్లదు. ఒకవేళ మతం మారడం తప్పనిసరి అనుకుంటే స్థానిక తహసీల్దార్‌కు నెల ముందే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఈ ఆర్డినెన్స్‌ను క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపవద్దని బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్‌ మచాడో గవర్నర్‌ను కోరారు. మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఆర్డినెన్స్ ఉందని ఆరోపించారు. ఆర్డినెన్స్‌ను అసెంబ్లీలోని క్రైస్తవులైన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకుండా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది.

First Published:  13 May 2022 2:39 AM IST
Next Story