Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ తో తలపడబోతున్న ఆచార్య

ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలైంది. ఆచార్య సినిమా గత వారమే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. కానీ ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. ఓటీటీలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ పోటీ పడబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈనెల 20న జీ5 లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య వస్తోంది. దీంతో ఆచార్య, ఆర్ఆర్ఆర్ మధ్య ఓటీటీ పోటీ మొదలైంది. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకొచ్చి సరిగ్గా […]

ఆర్ఆర్ఆర్ తో తలపడబోతున్న ఆచార్య
X

ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలైంది. ఆచార్య సినిమా గత వారమే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. కానీ ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. ఓటీటీలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ పోటీ పడబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈనెల 20న జీ5 లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య వస్తోంది. దీంతో ఆచార్య, ఆర్ఆర్ఆర్ మధ్య ఓటీటీ పోటీ మొదలైంది.

ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకొచ్చి సరిగ్గా 50 రోజులైంది. ఇప్పటికే చాలామంది చూసేశారు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. అయినప్పటికీ అది ఓటీటీలోకి వస్తే చూసేందుకు చాలామంది ఆత్రుతగా ఉన్నారు. ఆ సినిమాకున్న రిపీట్ వాల్యూ అలాంటిది.

ఆచార్య సినిమాది మరో కథ. లెక్కప్రకారం ఈ సినిమా జూన్ లో స్ట్రీమింగ్ కు రావాలి. కానీ థియేటర్లలో సినిమా ఫ్లాప్ అవ్వడంతో, కాస్త ముందుగానే ఈనెల 20న ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ కు అదనంగా 18 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అమెజాన్ అంగీకరించింది. అలా నష్టాలు కవర్ చేసుకునేందుకు ఆర్ఆర్ఆర్ తో తప్పనిసరి పరిస్థితుల మధ్య పోటీకి దిగాల్సి వచ్చింది ఆచార్య.

ఇలా ఊహించని విధంగా ఇటు ఆచార్య, అటు ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒకే టైమ్ లో ఓటీటీలోకి వస్తున్నాయి. నిజానికి ఓటీటీలో పోటీ అనేది ఉండదు. ఎవరైనా తమకు నచ్చినట్టు, నచ్చిన టైమ్ లో నచ్చిన సినిమా చూసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ రావడం ఆచార్యకు ఓటీటీలో ఎదురుదెబ్బ అంటున్నారు చాలామంది.

First Published:  13 May 2022 2:58 PM IST
Next Story