Telugu Global
CRIME

మతం మారాలంటూ బలవంత పెట్టిన ప్రియుడు.. మాట వినకపోయే సరికి..

సన్నిహితంగా ఉన్న ఫొటోలను బహిరంగపరుస్తామంటూ ఇటీవల కొంతమంది నీచులు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బుకోసమో, శారీరక సంబంధం కొనసాగించాలనో, లేక పెళ్లి చేసుకోవాలనో వారు డిమాండ్ చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి తన ప్రియురాలిని మతం మారాలంటూ డిమాండ్ చేశాడు. మాట వినకపోయే సరికి ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె బంధువులకు పంపించి పరువు తీశాడు. చివరకు ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు […]

మతం మారాలంటూ బలవంత పెట్టిన ప్రియుడు.. మాట వినకపోయే సరికి..
X

సన్నిహితంగా ఉన్న ఫొటోలను బహిరంగపరుస్తామంటూ ఇటీవల కొంతమంది నీచులు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బుకోసమో, శారీరక సంబంధం కొనసాగించాలనో, లేక పెళ్లి చేసుకోవాలనో వారు డిమాండ్ చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి తన ప్రియురాలిని మతం మారాలంటూ డిమాండ్ చేశాడు. మాట వినకపోయే సరికి ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె బంధువులకు పంపించి పరువు తీశాడు. చివరకు ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.

తమిళనాడులోని తిరుపూర్‌ కు చెందిన ఇమాన్ హనీఫ్ కరూర్ జిల్లా తిరుమణిలూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులను ఎదిరించి ఆమె ఇమాన్‌ తో కలిసి తిరుపూర్‌ కు వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని, అయితే వెంటనే ఆమె మతం మారాలని ఇమాన్ ఆదేశించాడు. మదర్సాలో చేర్పిస్తానని కూడా చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. మతం మార్చేందుకు మరింతగా ఒత్తిడి చేసినా ఫలితం లేకపోవడంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఇమాన్. తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను.. ఆమె ఇన్ స్టా అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆమె బంధువులకు కూడా పంపించాడు. అప్పటికీ మాట వినకపోతే మరింత విపరీత పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు తిరుపూర్‌ లోని నల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హిజాబ్ ధరించాలని కూడా ఒత్తిడి..
ఐటీయాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు ఇమాన్ పై కేసులు నమోదు చేశారు. గతంలో హిజాబ్ ధరించాలని కూడా ఆమెపై అతడు ఒత్తిడి చేసినట్టు తెలుసుకున్నారు. ఆమె బంగారు చెవిపోగులను కూడా తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడని తెలిసింది. శారీక వేధింపులతోపాటు, మతం మారాలంటూ మానసిక వేధింపులకు గురి చేసినందుకు అతడిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు. బాధితురాలిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

First Published:  12 May 2022 4:21 PM IST
Next Story