ఆ దేశంలో కరోనా తొలికేసు.. ఒక్క కేసుకే ఎమర్జెన్సీ అమలు..
ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ […]
ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ కూడా.. ఉత్తర కొరియా వైరస్ ఫ్రీ దేశంగా ఉంది. అయితే తొలిసారిగా అక్కడ కరోనా కేసు వెలుగు చూసింది. ప్యోంగ్యాంగ్ ప్రాంతంలో కరోనా వ్యాధిగ్రస్తుడిని అధికారులు గుర్తించారు. ఉత్తర కొరియాలో ఇది తొలి కరోనా కేసుగా ప్రకటించారు.
ప్యోంగ్యాంగ్ ప్రాంతంలో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించారు. వారిలో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని నిర్థారించారు. అయితే ఈ ఒక్క కేసుకే కిమ్ హడావిడి పడుతున్నారు. వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు కిమ్. వైరస్ జాడ బయటపడిన వెంటనే అధికారులతో కలసి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన కిమ్.. అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఎక్కడికక్కడ ఆంక్షలు..
ప్యోంగ్యాంగ్ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు మధ్య పూర్తిగా రాకపోకలను నిషేధించారు. ఆ మాటకొస్తే ఒక పట్టణానికి మరో పట్టణానికి సంబంధం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ.. తమ దేశంతో ఇతర దేశాలకు సంబంధం లేకుండా కట్టడి చేసిన కిమ్.. ఇప్పుడు తమ దేశంలోనే ఒక ప్రాంతానికి, ఇంకో ప్రాంతానికి సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టీకాలు లేని దేశం..
ప్రపంచమంతా కరోనా నివారణకు టీకాలు వేసుకుంటున్నా.. ఉత్తర కొరియాలో మాత్రం వైరస్ కే కాదు, టీకాలకు కూడా ఇప్పటి వరకూ నో ఎంట్రీ చెప్పారు కిమ్. చైనా, రష్యా.. టీకాలు సరఫరా చేస్తామన్నా కూడా కిమ్ కాదన్నారు. ఇప్పటి వరకూ ఉత్తర కొరియాకు చెందిన ఏ ఒక్కరూ టీకాలు తీసుకోలేదు. ప్రస్తుతం ఒకే ఒక్క కేసు బయటపడగానే.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని అమలులోకి తెచ్చిన కిమ్.. ముందు ముందు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.