Telugu Global
CRIME

పెళ్లిపీటలపై వధువు మృతి.. కేసులో మలుపు

విశాఖపట్నం సమీపంలోని మధురవాడలో విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో తాళిక‌ట్టించుకోవాల్సిన ఓ వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. కన్నవాళ్లకు తీవ్ర శోకం మిగిల్చి వెళ్లిపోయింది. విశాఖకు చెందిన సృజనకు.. శివాజీ అనే యువకుడికి వివాహం నిశ్చయించారు. బుధవారం రాత్రి వీరి వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపం వద్దకు బంధువులు కూడా చేరుకున్నారు. వధూవరులకు జీలకర్ర పెట్టే సమయంలో ఒక్కసారిగా వధువు కుప్పకూలింది. ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సృజన మృతిచెందింది. ఈ ఘటన […]

పెళ్లిపీటలపై వధువు మృతి.. కేసులో మలుపు
X

విశాఖపట్నం సమీపంలోని మధురవాడలో విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో తాళిక‌ట్టించుకోవాల్సిన ఓ వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. కన్నవాళ్లకు తీవ్ర శోకం మిగిల్చి వెళ్లిపోయింది. విశాఖకు చెందిన సృజనకు.. శివాజీ అనే యువకుడికి వివాహం నిశ్చయించారు. బుధవారం రాత్రి వీరి వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపం వద్దకు బంధువులు కూడా చేరుకున్నారు. వధూవరులకు జీలకర్ర పెట్టే సమయంలో ఒక్కసారిగా వధువు కుప్పకూలింది. ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సృజన మృతిచెందింది. ఈ ఘటన ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.

పాయిజన్ తీసుకోవడం వల్లే..
అయితే.. సృజన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత సృజన గుండెపోటుతోనే మృతిచెందిందని అంతా భావించారు. కానీ, పోస్టుమార్టం రిపోర్టు అనంతరం పోలీసులు అసలు విషయం చెప్పారు. పాయిజన్ తీసుకోవడం వల్లే ఆమె మృతిచెందినట్టు పీఎం పాలెం సీఐ రవికుమార్ మీడియాకు తెలిపారు.

వ‌ధువు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నదా? లేక ఎవరైనా ఆమెకు అందించే ఆహారంలో విషం కలిపారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి పెళ్లికి నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ షూట్ సైతం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

First Published:  12 May 2022 7:29 AM GMT
Next Story