Telugu Global
Cinema & Entertainment

విజయ్-పైడిపల్లి సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాలోకి పీవీపీ బ్యానర్ కూడా ఎంటరైంది. పరమ్ వి పొట్లూరి ఓ నిర్మాతగా మారారు. వీళ్లంతా కలిసి విజయ్ కొత్త సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ […]

విజయ్-పైడిపల్లి సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాలోకి పీవీపీ బ్యానర్ కూడా ఎంటరైంది. పరమ్ వి పొట్లూరి ఓ నిర్మాతగా మారారు. వీళ్లంతా కలిసి విజయ్ కొత్త సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తెలుగు, తమిళ భాషలకు చెందిన పెద్ద నటీనటులు కనిపించనున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ నటిస్తున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.

ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్‌ సాల్మన్‌.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

విజయ్ హీరోగా నటిస్తున్న తొలి తెలుగు-తమిళ ప్రాజెక్టు ఇదే. పైగా ఓ తెలుగు దర్శకుడితో కలిసి విజయ్ చేస్తున్న సినిమా కూడా కావడంతో.. ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా విజయ్ నటించిన బీస్ట్ సినిమాకు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే కంటెంట్ లేకపోవడం వల్ల ఆ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయింది.

First Published:  11 May 2022 10:57 AM IST
Next Story