నాయనమ్మ ఊరికి కేటీఆర్ వరాల జల్లు.
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ వెంకటమ్మ స్వగ్రామమైన కోనాపూర్ లో పర్యటించారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కోనాపూర్ ఉంది. గతంలో ఈ ఊరిని పోసానిపల్లిగా పిలిచేవారు. నాయనమ్మ జ్ఞాపకార్థం.. కోనాపూర్ లో స్కూల్ బిల్డింగ్ నిర్మించబోతున్నారు కేటీఆర్. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండున్నర కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మిస్తున్న స్కూల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. […]
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ వెంకటమ్మ స్వగ్రామమైన కోనాపూర్ లో పర్యటించారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కోనాపూర్ ఉంది. గతంలో ఈ ఊరిని పోసానిపల్లిగా పిలిచేవారు. నాయనమ్మ జ్ఞాపకార్థం.. కోనాపూర్ లో స్కూల్ బిల్డింగ్ నిర్మించబోతున్నారు కేటీఆర్. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండున్నర కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మిస్తున్న స్కూల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తొలిసారిగా నాయనమ్మ ఊరికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్న ఆయన.. కోనాపూర్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మా తాత ఇల్లరికం వచ్చారు..
కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే “సుమారు 80-85 ఏండ్ల కిందటి కథ ఇది. మా నాయనమ్మది పోసానిపల్లి. తాత రాఘవరావుది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట గ్రామం. నాయనమ్మ వాళ్లకు మగ పిల్లలు లేరు. పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం అడగడంతో మాతాత ఇక్కడికే వచ్చారు. ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటూ 1930 నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మానేరు వాగు మీద అప్పర్ మానేరు డ్యాం కట్టే సమయంలో చెరువు విస్తరణలో మా కుటుంబానికి సంబంధించి వందల ఎకరాలు కోల్పోయాం. అందుకు పరిహారంగా రూ.2.5 లక్షలు ఇచ్చారు. అలా పోసానిపల్లి నుంచి సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామానికి వెళ్లి 500 ఎకరాలు కొనుగోలు చేసి మళ్లీ వ్యవసాయం మొదలు పెట్టారు మా తాత. అక్కడ 1954లో కేసీఆర్ జన్మించారు.” అని గతాన్ని నెమరువేసుకున్నారు కేటీఆర్.
మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉందని చెప్పిన కేటీఆర్.. నాయనమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ ఊరు లోయర్ మానేరులో మునిగిపోయిందని గుర్తు చేసుకున్నారు. నాయనమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా తన సొంత ఖర్చులతో పాఠశాలలు నిర్మిస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
కోనాపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన కేటీఆర్.. గ్రామానికి సీసీ రోడ్లు, తాగునీటి కోసం 2 కిలోమీటర్ల పైప్ లైన్, బస్ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. బీబీపేట మండలానికి జూనియర్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు.