ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు చికిత్స చేసి ఓ వ్యక్తిని చంపేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వాచ్‌మన్, స్వీపర్లు, కంపౌండర్ లు కలిసి చికిత్స చేసి ఓ లెక్చరర్ ను చంపేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో లెక్చరర్ గా పని చేస్తున్న రామకృష్ణ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే తీవ్ర గాయాలపాలై ఎక్కువగా రక్తం పోయినప్పటికీ అక్కడున్న డాక్టర్లు పట్టించుకోలేదు. […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వాచ్‌మన్, స్వీపర్లు, కంపౌండర్ లు కలిసి చికిత్స చేసి ఓ లెక్చరర్ ను చంపేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో లెక్చరర్ గా పని చేస్తున్న రామకృష్ణ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే తీవ్ర గాయాలపాలై ఎక్కువగా రక్తం పోయినప్పటికీ అక్కడున్న డాక్టర్లు పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు స్వీపర్లు, ఓ కంపౌండర్ కలిసి లెక్చరర్ రామకృష్ణ కు చికిత్స చేశారు. డ్యూటీ డాక్టర్ వచ్చి ఓ ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రామకృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ డాక్టర్లు రాకపోగా సెక్యూరిటీ సిబ్బందే చికిత్స చేశారు. చివరకు వాళ్ళు చేసిన చికిత్స వల్ల రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు పట్టించుకొని ఉంటే తమ సోదరుడు బతికేవాడని రామకృష్ణ సోదరుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు అన్ని విధాలా శిక్షణ పొంది ఉన్నారని, అందుకే వాళ్ళతో చికిత్స చేయించామని చెప్పారు. మరో వైపు రామకృష్ణకు సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు చికిత్స చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజనులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.