Telugu Global
NEWS

ప్రపంచంలో రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ -కేటీఆర్..

ప్రపంచంలో రైతులకోసం ఉచిత ఇన్సూరెన్స్ చేయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని 40లక్షలమంది రైతులకోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత బీమా చేయించిందని గుర్తు చేశారు. రైతు బీమా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 1600 కోట్ల నుంచి 1700 కోట్ల రూపాయల వరకు ప్రీమియం చెల్లింపుకోసం ఖర్చు పెడుతోందని ఆయన వివరించారు. రైతుబంధు కోసం 50వేల కోట్లు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేసీఆర్ సర్కారు రైతు బంధుకోసం 50వేల […]

ప్రపంచంలో రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ -కేటీఆర్..
X

ప్రపంచంలో రైతులకోసం ఉచిత ఇన్సూరెన్స్ చేయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని 40లక్షలమంది రైతులకోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత బీమా చేయించిందని గుర్తు చేశారు. రైతు బీమా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 1600 కోట్ల నుంచి 1700 కోట్ల రూపాయల వరకు ప్రీమియం చెల్లింపుకోసం ఖర్చు పెడుతోందని ఆయన వివరించారు.

రైతుబంధు కోసం 50వేల కోట్లు..
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేసీఆర్ సర్కారు రైతు బంధుకోసం 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఆమేరకు నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల మంది రైతులకు రైతు బంధు అందిందని వివరించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టినన్ని కార్యక్రమాలను దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా ఏ ప్రభుత్వం కనీసం ఆలోచించలేకపోయిందని అన్నారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దమ్మన్నపేటలో రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

17వేల కోట్ల రుణమాఫీ..
రైతులు తీసుకున్న రుణాలు దాదాపు 17వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు కేటీఆర్. 3వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతున్నా యాసంగి సీజన్ లో రైతులనుంచి ధాన్యాన్ని తాము సేకరిస్తున్నామని గుర్తు చేశారు. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించే కార్యక్రమం కూడా సజావుగా సాగుతుందన్న కేసీఆర్.. ఆయనే స్వయంగా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్ట్ లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, రైతులకు అండగా నిలిచేందుకు ప్రాజెక్ట్ ల నిర్మాణం, నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వేసవిలో కూడా రైతులకు సాగునీరు అందుతుందంటే.. దానికి కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లే కారణం అని అన్నారు కేటీఆర్.

First Published:  10 May 2022 9:30 PM GMT
Next Story