Telugu Global
Others

గురివింద గింజ పార్టీ.. అక్రమాలు, అవినీతిలో మేటి..

బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే దాన్ని గురివింద గింజ పార్టీ అంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ నీచ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన రవీంద్రనాథ్ ప్రభుత్వ తీరుని నిరశిస్తూ రాజీనామా చేశారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్‌ మెంట్ డీజీపీగా పనిచేస్తున్న రవీంద్రనాథ్ ని ఇటీవలే కర్నాటక పోలీస్ ట్రైనింగ్ వింగ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తనను […]

గురివింద గింజ పార్టీ.. అక్రమాలు, అవినీతిలో మేటి..
X

బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే దాన్ని గురివింద గింజ పార్టీ అంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ నీచ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన రవీంద్రనాథ్ ప్రభుత్వ తీరుని నిరశిస్తూ రాజీనామా చేశారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్‌ మెంట్ డీజీపీగా పనిచేస్తున్న రవీంద్రనాథ్ ని ఇటీవలే కర్నాటక పోలీస్ ట్రైనింగ్ వింగ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తనను ట్రాన్స్ ఫర్ చేసిందని ఆరోపిస్తూ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

అసలేం జరిగింది..?
నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ప్రమోషన్ పొందారన్న కారణంగా రిటైర్డ్ అధికారి కెంపన్నపై ఇటీవల విచారణ మొదలైంది. ఆ కేసు దర్యాప్తు అధికారిగా రవీంద్రనాథ్ వ్యవహరిస్తున్నారు. అయితే కెంపన్నకు ప్రభుత్వంలోని పెద్దల మద్దతు ఉంది. ఆయన బీజేపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఆయన్ను కాపాడేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. దర్యాప్తు అధికారిగా ఉన్న రవీంద్రనాథ్ పై ఒత్తిడి తెచ్చారు. ఆ కేసులో కెంపన్నను రక్షించాలని రవీంద్రనాథ్ కి సూచించారు. కానీ ఆయన వినలేదు. నిజాయితీగా పనిచేస్తానన్నారు. దీంతో ఏకంగా రవీంద్రనాథ్ పై బదిలీ వేటు పడింది. కెంపన్నను రక్షించడం కోసం రవీంద్రనాథ్ ని బదిలీ పేరుతో బలి చేయాలనుకున్నారు. దీంతో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపిస్తున్న కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మీడియాకు తెలిపారు.

అంతకు ముందు ఏం జరిగింది..?
నిజాయితీగల అధికారిగా పేరున్న రవీంద్రనాథ్ రాజీనామా చేయడం ఇదే తొలిసారి కాదు. డాక్టర్‌ పి.రవీంద్రనాథ్‌ 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2008లో అసిస్టెంట్ డీజీపీగా ఉన్న సీనియర్ సహోద్యోగి ఉమాపతి ఆరోపణలను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ తొలిసారిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత 2014లో ఓ కేఫ్ లో మహిళ పొటోలను తీశారనే కేసులో తనను ఇరికించబోయారంటూ రాజీనామా చేశారు. అయితే అప్పట్లో ఉన్నతాధికారుల విన్నపంతో ఆయన తన రాజీనామా నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఈసారి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

First Published:  11 May 2022 5:35 AM IST
Next Story