Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 ట్రయిలర్ కు అద్భుత స్పందన

టాలీవుడ్ ప్రేక్షకులు ఇటీవలి కాలంలో యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌ లే ఎక్కువగా చూశారు. ఓ మంచి కామెడీ సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఆ లోటును తీర్చబోతోంది ఎఫ్3 సినిమా. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 ట్రయిలర్ సూపర్ హిట్టయింది. థియేట్రికల్ ట్రైలర్‌ను చూసి వారు చాలా థ్రిల్ అయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ట్రైలర్‌ తోనే బోలెడన్ని నవ్వులు పూయించాడు. ఎఫ్2 కంటే ఎఫ్3తో రెట్టింపు వినోదం అందిస్తామని ఇంతకుముందే […]

ఎఫ్3 ట్రయిలర్ కు అద్భుత స్పందన
X

టాలీవుడ్ ప్రేక్షకులు ఇటీవలి కాలంలో యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌ లే ఎక్కువగా చూశారు. ఓ మంచి కామెడీ సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఆ లోటును తీర్చబోతోంది ఎఫ్3 సినిమా. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 ట్రయిలర్ సూపర్ హిట్టయింది. థియేట్రికల్ ట్రైలర్‌ను చూసి వారు చాలా థ్రిల్ అయ్యారు.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ట్రైలర్‌ తోనే బోలెడన్ని నవ్వులు పూయించాడు. ఎఫ్2 కంటే ఎఫ్3తో రెట్టింపు వినోదం అందిస్తామని ఇంతకుముందే చెప్పాడు ఈ దర్శకుడు. చెప్పినట్టుగానే ట్రయిలర్ డబుల్ డోస్ అందించింది. యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఇద్దరూ అద్భుతంగా కామెడీ పండించారు.

ఎఫ్3 ట్రయిలర్ 24 గంటల్లో 2 లక్షల 60 వేల లైకులతో, 12.5 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్‌లో ఈ నంబర్లు చాలా పెద్దవి. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ తో ఎఫ్3కి ఎక్స్ ట్రా గ్లామర్ డోస్ వచ్చింది. వీళ్లు కాకుండా పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య మే 27న థియేటర్లలోకి వస్తోంది ఎఫ్3 సినిమా. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటి బాధితుడిగా, వరుణ్ తేజ్ నత్తి ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు.

First Published:  11 May 2022 10:34 AM IST
Next Story