అసని ఎఫెక్ట్: కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
అసని తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తీర ప్రాంతంలోనే తుపాన్ తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ నిర్వాసితులకు తక్షణ సాయం కింద రూ. 2 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని […]

అసని తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తీర ప్రాంతంలోనే తుపాన్ తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ నిర్వాసితులకు తక్షణ సాయం కింద రూ. 2 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
అసని తుపాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారికోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. నిర్వాసితులు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు..
కాకినాడ – 18004253077, 0884-2368100
శ్రీకాకుళం- 08942-240557
తూర్పు గోదావరి- 8885425365
ఏలూరు- 18002331077
విజయనగరం- 08922-236947
పార్వతీపురం మన్యం- 7286881293
మచిలీపట్నం- 08672 252572, 08672 252486
బాపట్ల- 8712655878, 8712655881
ఎన్టీఆర్ జిల్లా – 90103 13920
విశాఖ- 0891-2590100,102
అనకాపల్లి- 7730939383