Telugu Global
NEWS

నిందితులను వెనకేసుకొస్తారా?.. టీడీపీ నేతలపై సజ్జల ఫైర్

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదు.. అని టీడీపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. నారాయణ అరెస్ట్ వ్యవహారంలో పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. వారి స్కూలుకు చెందిన సిబ్బంది […]

నిందితులను వెనకేసుకొస్తారా?.. టీడీపీ నేతలపై సజ్జల ఫైర్
X

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదు.. అని టీడీపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

నారాయణ అరెస్ట్ వ్యవహారంలో పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. వారి స్కూలుకు చెందిన సిబ్బంది పోలీసుల విచారణలో నారాయణ ఆదేశాల మేరకే పేపర్ లీకేజీకి పాల్పడ్డట్టు చెప్పారన్నారు. ఇప్పుడేమో టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేశారు కాబట్టి.. ఆయనకు ఏ సంబంధం లేదని చెప్పడం ఏమిటని..ఆయన వారసులను అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదని టీడీపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

‘నారాయణ అరెస్ట్ పట్ల చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదో గొప్ప విప్లవకారుడు అరెస్ట్ అయినట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇక కొంతమంది టీడీపీ నేతల స్పందన కూడా అలాగే ఉంది. తప్పు చేసి దొరికిపోయి ఇలా బుకాయించడం వాళ్లకే చెల్లింది. రాష్ట్రంలోని ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా’ అని సజ్జల ప్రశ్నించారు.

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నారాయణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలుగుదేశం నేతలు కక్ష సాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారు. కాగా తాజాగా ఈ విషయంపై సజ్జల స్పందించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఘాటుగా స్పందించారు.

First Published:  11 May 2022 1:20 PM IST
Next Story