Telugu Global
NEWS

మీకు మిగిలింది 24 సీట్లే..  వాటికోసం పొత్తులు పెట్టుకుంటారో? పోట్లాడుతారో మీ ఇష్టం..!

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మొత్తం 151 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు మిగిలినవి కేవలం 24 సీట్లు మాత్రమేనన్నారు. ఆ సీట్ల కోసం వాళ్లు పొత్తులు పెట్టుకుంటారో? పోట్లాడుకుంటారో? వాళ్ల ఇష్టం అని పేర్కొన్నారు. గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదని చంద్రబాబు, […]

మీకు మిగిలింది 24 సీట్లే..  వాటికోసం పొత్తులు పెట్టుకుంటారో? పోట్లాడుతారో మీ ఇష్టం..!
X

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మొత్తం 151 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు మిగిలినవి కేవలం 24 సీట్లు మాత్రమేనన్నారు. ఆ సీట్ల కోసం వాళ్లు పొత్తులు పెట్టుకుంటారో? పోట్లాడుకుంటారో? వాళ్ల ఇష్టం అని పేర్కొన్నారు. గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని గుడివాడలో పర్యటించారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలలు కంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేనప్పుడు ఆయన ఓట్లు చీలనివ్వనని చెప్పడం హాస్యాస్పదం.

చంద్రబాబు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర మీటింగ్‌లో చంద్రబాబు సభలకు జనం తండోపతండాలుగా వచ్చారని పచ్చమీడియా కలరింగ్ ఇస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టారు. నిజానికి ఆయనను ప్రజలు పట్టించుకోవడం లేదు. అసలు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు దొరకకుండా పోతారేమోనని వారిలో స్థైర్యం నింపేందుకు పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు.’ అంటూ నాని ఫైర్ అయ్యారు.

మరోవైపు గడపగడపకు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. గుడివాడ నియోజవర్గాన్ని తాను ఇప్పటికే అభివృద్ధి చేశానని రానున్న రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

First Published:  11 May 2022 8:06 AM GMT
Next Story