Telugu Global
Health & Life Style

సమ్మర్‌లో బెస్ట్ సీజనల్ ఫుడ్స్ ఇవే..

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా మారుస్తుండాలి. సీజన్‌ను బట్టి పండే కాయగూరలను తినడం ద్వారా ఆయా సీజన్లలో వచ్చే రుగ్మతలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. మరి ఈ సీజన్‌లో అస్సలు మిస్ అవ్వకూడని ఫుడ్స్ ఏంటంటే.. సీజన్స్ వారీగా పండే పండ్లు, కూరగాయల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఇవి రసాయనాల సాయం లేకుండా సహజంగా పెరుగుతాయి కాబట్టి వీటిలో పోషకాలు ఎక్కువ. సీజనల్ పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవడం […]

సమ్మర్‌లో బెస్ట్ సీజనల్ ఫుడ్స్ ఇవే..
X

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా మారుస్తుండాలి. సీజన్‌ను బట్టి పండే కాయగూరలను తినడం ద్వారా ఆయా సీజన్లలో వచ్చే రుగ్మతలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. మరి ఈ సీజన్‌లో అస్సలు మిస్ అవ్వకూడని ఫుడ్స్ ఏంటంటే..

సీజన్స్ వారీగా పండే పండ్లు, కూరగాయల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఇవి రసాయనాల సాయం లేకుండా సహజంగా పెరుగుతాయి కాబట్టి వీటిలో పోషకాలు ఎక్కువ. సీజనల్ పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆయా సీజన్లలో వచ్చే సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. సమ్మర్‌లో బెస్ట్ సీజనల్ ఫుడ్స్ ఇవే..

మామిడి పండ్లు
కేవలం సమ్మర్‌లో మాత్రమే ఎక్కువగా పండే పండ్లలో మ్యాంగో ముందుంటుంది. ఇది సమ్మర్‌లో మాత్రమే పండినప్పటికీ దీన్ని పండ్లలో రారాజు అంటుంటారు. విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే మామిడి కాయలను ఈ సీజన్‌లో అస్సలు మిస్ అవ్వకండి.

పుచ్చకాయ
సమ్మర్‌లో దాహాన్ని తీర్చే ఏకైక పండు పుచ్చకాయ. సమ్మర్ వస్తే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా పుచ్చకాయలే కనిపిస్తాయి. ఇందులో ఉండే న్యూట్రియెంట్స్, వాటర్ కంటెంట్ వల్ల సమ్మర్‌లో ఇది బెస్ట్ ఫ్రూట్‌గా నిలుస్తోంది.

కొబ్బరి నీళ్లు
సమ్మర్‌లో ఎక్కువగా దొరికే వాటిలో కొబ్బరిబోండాలు కూడా ఉన్నాయి. సమ్మర్‌లో వచ్చే రకరకాల ప్రాబ్లెమ్స్‌కు కొబ్బరినీళ్లతో చెక్ పెట్టొచ్చు. సమ్మర్‌లో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు, తక్షణ శక్తి పొందేందుకు కొబ్బరినీళ్లు తప్పకుండా తీసుకోవాలి.

పాలకూర
సమ్మర్‌లో ఎక్కువగా పండే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. అంతేకాకుండా ఎన్నోరకాల రుగ్మతలను పాలకూరతో తగ్గించుకోవచ్చు. అందుకే సమ్మర్‌లో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో పాలకూర కూడా ఒకటి.

దొండకాయలు
దొండకాయలు కూడా సమ్మర్‌లోనే ఎక్కువగా పండుతుంటాయి. దొండకాయల్లో నీటిశాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే సమ్మర్‌లో దొండకాయలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

కర్భూజా
ఇకపోతే సమ్మర్‌లో కర్భూజా పండ్లు చేసే మేలు అంతాఇంతా కాదు. దాదాపు 90 శాతం వాటర్ కంటెంట్ ఉండే ఈ పండ్లతో తక్షణ శక్తి లభించడంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

First Published:  10 May 2022 2:29 PM IST
Next Story