Telugu Global
NEWS

పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటారా?

వ్యవ‌సాయ పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వందల ఎకరాల భూములున్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారని అలాంటి వ్యక్తిని కొందరు ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పర్యటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ తన పూర్వీకుల ఇంటిని సందర్శించారు. మన ఊరు […]

పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటారా?
X

వ్యవ‌సాయ పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వందల ఎకరాల భూములున్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారని అలాంటి వ్యక్తిని కొందరు ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పర్యటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ తన పూర్వీకుల ఇంటిని సందర్శించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం లో భాగంగా తన నానమ్మ జ్ఙాపకార్థం స్వంత ఖర్చులతో పాఠశాలను నిర్మించనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.

First Published:  10 May 2022 1:42 PM IST
Next Story