Telugu Global
NEWS

తెలంగాణ పోలీసులకు కొత్త టార్చర్‌

తెలంగాణ పోలీసులకు కొత్త రకం టార్చర్‌ మొదలైంది. ముఖ్యంగా రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల వికారాబాద్ జరిగిన సంఘటన చూస్తే పోలీసుల కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది. రెండు రోజుల కిందట అర్ధ‌రాత్రి రెండు గంటలకు డయల్‌ 100కి ఓ ఫోన్‌ వచ్చింది. వికారాబాద్‌కి చెందిన మధు తాను ఆపదలో ఉన్నానని.. తనకు సాయం చేయాలంటూ ఫోన్‌ చేశాడు. ఎలాంటి కష్టాల్లో ఉన్నావని అడిగితే.. ఫోన్‌లో చెప్పలేనని, తన దగ్గరికి […]

తెలంగాణ పోలీసులకు కొత్త టార్చర్‌
X

తెలంగాణ పోలీసులకు కొత్త రకం టార్చర్‌ మొదలైంది. ముఖ్యంగా రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల వికారాబాద్ జరిగిన సంఘటన చూస్తే పోలీసుల కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది.

రెండు రోజుల కిందట అర్ధ‌రాత్రి రెండు గంటలకు డయల్‌ 100కి ఓ ఫోన్‌ వచ్చింది. వికారాబాద్‌కి చెందిన మధు తాను ఆపదలో ఉన్నానని.. తనకు సాయం చేయాలంటూ ఫోన్‌ చేశాడు. ఎలాంటి కష్టాల్లో ఉన్నావని అడిగితే.. ఫోన్‌లో చెప్పలేనని, తన దగ్గరికి పోలీసులను పంపిస్తే విషయం చెబుతానంటూ బ‌దులిచ్చాడు. మధు సెల్ నంబర్‌ ట్రాక్‌ చేసిన పోలీసులు అతని దగ్గరికి వికారాబాద్‌ కానిస్టేబుల్‌ను పంపారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే పీకలదాకా తాగిన మధు.. తనకు రెండు చల్లని బీర్లు కావాలంటూ ఆఫర్‌ ఇచ్చాడు.

వికారాబాద్ పక్కనే ఉన్న దౌల్తాబాద్‌లో వైన్ షాపులు మాసివేశారని.. తనకు రెండు బీర్లు కావాలని పోలీసులకు వినతి పెట్టుకున్నాడు. అప్పటికే ఫుల్లుగా తాగిన అతన్ని చూసి బీట్‌ కానిస్టేబుల్‌కు చీర్రెత్తింది. రెండు దెబ్బలు తగిలించి.. అతనిపై న్యూ సెన్స్‌ కేసు పెట్టారు. మరోవైపు ఇటీవల నల్గొండలో కూడా ఇటువంటి కేసే పోలీసులకు తగిలింది. తన భార్య తాను చెప్పిన కూర వండలేదని అర్ధరాత్రి పోలీసులకు కాల్‌ చేసి టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల డయల్‌ 100కి ఇటువంటి కాల్స్‌ పెరిగిపోయాయని పోలీసులు అంటున్నారు.

First Published:  10 May 2022 7:54 AM IST
Next Story