Telugu Global
NEWS

ఆ విషయంలో మగవారిదే పైచేయి..

“ఆడవాళ్లు టీవీ కనపడితే చాలు అతుక్కుపోతారు, సీరియల్స్ లో తలదూరిస్తే.. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. భర్త ఆఫీస్ కి వెళ్లాక, బంధువులతో ఒకటే సెల్ ఫోన్ ముచ్చట్లు. మొబైల్ షాపింగ్ తో రోజంతా టైమ్ పాస్ చేయగలరు..”సహజంగా మహిళలపై ఉన్న అపవాదులివి. కానీ మగవారితో పోల్చి చూస్తే ఆడవారు సెల్ ఫోన్ చూడటంలోనూ, టీవీ చూడటంలోనూ, పేపర్ చదవడంలోనూ.. ఇలా అన్నిట్లోనూ వెనకబడి ఉన్నారని జాతీయ కుటుంబ సర్వే -5 ఫలితాలు చెబుతున్నాయి. తెలంగాణలో […]

ఆ విషయంలో మగవారిదే పైచేయి..
X

“ఆడవాళ్లు టీవీ కనపడితే చాలు అతుక్కుపోతారు, సీరియల్స్ లో తలదూరిస్తే.. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. భర్త ఆఫీస్ కి వెళ్లాక, బంధువులతో ఒకటే సెల్ ఫోన్ ముచ్చట్లు. మొబైల్ షాపింగ్ తో రోజంతా టైమ్ పాస్ చేయగలరు..”సహజంగా మహిళలపై ఉన్న అపవాదులివి. కానీ మగవారితో పోల్చి చూస్తే ఆడవారు సెల్ ఫోన్ చూడటంలోనూ, టీవీ చూడటంలోనూ, పేపర్ చదవడంలోనూ.. ఇలా అన్నిట్లోనూ వెనకబడి ఉన్నారని జాతీయ కుటుంబ సర్వే -5 ఫలితాలు చెబుతున్నాయి. తెలంగాణలో మహిళలు.. ఇంటర్నెట్ వాడకంలో చాలా వెనకబడి ఉన్నారనేది ఈ సర్వే సారాంశం. దేశ సగటుతో పోల్చి చూస్తే తెలంగాణలో ఇంటర్నెట్ వాడే మహిళల సంఖ్య మరీ తక్కువగా ఉండటం విశేషం.

15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 33శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే తెలంగాణ విషయానికొస్తే కేవలం 26.5 శాతం మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పురుషుల విషయంలో ఆ తేడా స్వల్పంగానే ఉంది. దేశవ్యాప్తంగా 15-49 మధ్య వయసు ఉన్న పురుషులు 51.2 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుంటే తెలంగాణలో అది 50శాతంగా ఉంది. దీన్నిబట్టి.. తెలంగాణ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో చాలా వెనకబడి ఉన్నారని స్పష్టమవుతోంది.

తెలంగాణ మహిళల్లో న్యూస్ పేపర్లు చదివే వారు 17.1 శాతం మంది. టీవీ చూసేవారు 75.1 శాతం మంది. రేడియో వినేవారు 2.1 శాతం కాగా, సినిమాలతో కాలక్షేపం చేసే వారి సంఖ్య 15.7 శాతంగా ఉంది. మొత్తంగా టీవీ, లేదా పేపర్ లేదా రేడియో.. ఇలా ఏ ఒక్క మాధ్యమానికి కూడా నోచుకోనివారి శాతం 20.1 గా ఉంది. ఇక మగవారి విషయానికొస్తే.. కేవలం 11.8 శాతం మంది మాత్రమే ఏ మాధ్యమానికి కూడా దగ్గరగా లేరు. అంటే మగవారిలో 88.2 శాతం మంది ఏదొ ఒక మాధ్యమం ద్వారా వినోదాన్ని పొందుతున్నరు. ఆడవారిలో మాత్రం ఈ ఛాన్స్ కేవలం 79.9శాతం మందికే ఉంది.

మీడియా ద్వారా సమాచారం తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడే మహిళలకు అన్ని రంగాల్లో పరిజ్ఞానం పెరుగుతుంది. మహిళా సాధికారిత సాకారమవుతుంది. అయితే ఇక్కడ కనీస పరిజ్ఞానం పొందేందుకు కూడా మహిళలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కేవలం టీవీ చూసే విషయంలోనే పురుషులకు సమానంగా మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో మాత్రం మహిళలు చాలా వెనకబడి ఉన్నారు.

పేద, ధనిక భేదం లేదు..
పెళ్లి కాని మగవారిలో 57శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుంటే, ఆడవారిలో సగానికి సగం మంది మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. ఇక ధనికుల్లో ఈ అంతరం తక్కువే అనుకుంటే పొరపాటే. ధనిక వర్గాల్లోని పురుషుల్లో 78శాతం మంది ఇంటర్నెట్ వాడుతుంటే, మహిళల్లో 69శాతం మంది డేటా వినియోగంలో ముందున్నారు. పేదవారిలో అయితే ఈ అంతరం చాలా ఎక్కువ. పేద వర్గాల్లో 26శాతం మంది పురుషులు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. మహిళలు కేవలం 9శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ కి దగ్గరగా ఉన్నారు.

First Published:  10 May 2022 8:45 AM IST
Next Story