Telugu Global
Others

ఆనాడు ప్రభాకరన్ ఊహించింది నిజమే అయ్యిందా? ఈనాడు ఈలం ఉంటే ఏం జరిగేది?

శ్రీలంక అనగానే ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రాముడు-సీత గుర్తొస్తారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్ అంటే వైరం, బంగ్లాదేశ్ అంటే కాస్త ద్వేషం, నేపాల్, భూటాన్ అంటే పెద్ద పట్టింపు ఉండదు. కానీ శ్రీలంక అంటే ఎక్కడో ప్రేమ. భారతదేశపు కన్నీటి చుక్క అని ఎన్నో దశాబ్దాలుగా పేరు ఉన్న శ్రీలంక.. ఇవ్వాల నిజంగానే ఒక దుఖః దేశంగా మిగిలింది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే కాస్త ఎక్కువ ఉండే ఆ దేశం ఇప్పుడు పూర్తి […]

ఆనాడు ప్రభాకరన్ ఊహించింది నిజమే అయ్యిందా? ఈనాడు ఈలం ఉంటే ఏం జరిగేది?
X

శ్రీలంక అనగానే ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రాముడు-సీత గుర్తొస్తారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్ అంటే వైరం, బంగ్లాదేశ్ అంటే కాస్త ద్వేషం, నేపాల్, భూటాన్ అంటే పెద్ద పట్టింపు ఉండదు. కానీ శ్రీలంక అంటే ఎక్కడో ప్రేమ. భారతదేశపు కన్నీటి చుక్క అని ఎన్నో దశాబ్దాలుగా పేరు ఉన్న శ్రీలంక.. ఇవ్వాల నిజంగానే ఒక దుఖః దేశంగా మిగిలింది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే కాస్త ఎక్కువ ఉండే ఆ దేశం ఇప్పుడు పూర్తి సంక్షోభంలో మునిగింది. దీనికి కారకులు ఎవరంటే అందరూ రాజపక్స కుటుంబం వైపే వేలు చూపెడుతున్నారు.

నిజంగా శ్రీలంకకు ఏం జరిగింది? అక్కడి ప్రజలు కొన్నాళ్లుగా దేవుళ్లుగా భావించిన రాజపక్స కుటుంబంపై ఎందుకంత ద్వేషం పెంచుకున్నారు? తమిళ ఈలం ఈ సమయంలో ఉండుంటే ఏం జరిగేది? ప్రభాకరన్ ఉంటే శ్రీలంక రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకునేది? అని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారు.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు టూరిజం, దాల్చిన చెక్క ఎగుమతులే పెద్ద సపోర్ట్. అయితే కొలంబో చర్చీల్లో బాంబు పేలుళ్లు, కోవిడ్ కారణంగా టూరిజం భారీగా దెబ్బతిన్నది. ఆ తర్వాత దాల్చిన చెక్క ఎగుమతులు కూడా పడిపోయాయి. దీంతో లంకకు విదేశీ మారకద్రవ్యం తగ్గిపోయింది. అదే సమయంలో అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబం తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకొని భారీ అవినీతికి పాల్పడింది. శ్రీలంకలో తమిళ ఈలం ఉద్యమం జరిగే రోజుల్లో శ్రీలంకలో ఉద్రిక్తత నెలకొన్నా.. ఇలా ఆర్థిక సంక్షోభం ఏనాడూ కలుగలేదు. అసలు అనామకంగా ఉండే శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందే తమిళులు. అందుకే అక్కడ భారీ మద్దతు ఉండేది.

కానీ అమెరికా, శ్రీలంకలో తమిళేతరులు కలిసి ఒక పెద్ద యుద్దాన్ని కావాలనే సృష్టించారు. మీడియా, సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేని రోజుల్లో అమెరికా, సీఐఏ చెప్పిందే ప్రపంచమంతా నిజమని నమ్మేది. కానీ నిజానికి ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈ అక్కడ అస్థిత్వం కోసం పోరాడిందే తప్ప ఏనాడూ దేశాన్ని నాశనం చేయాలని అనుకోలేదు. ఆ సమయంలో అమెరికా అండతో శ్రీలంక ప్రభుత్వం తమిళ ఈలం కోసం పోరాడే వాళ్లను తరిమి కొట్టింది. అనేక మంది తమిళులను హత్య చేసింది. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

అయితే ఆనాడు ప్రభాకరన్ అండ్ టీం ఏదైతే ఊహించి పోరాటం చేశారో.. ఇప్పుడు సరిగ్గా శ్రీలంకలో అవే పరిస్థితులు ఉన్నాయి. లంక ఏనాటికైనా పూర్తిగా నాశనం అవుతుందని.. ఆ దేశాన్ని ఆర్ధికంగా బలపర్చాలని, అందుకు తమిళుల భాగస్వామ్యం అవసరమని ప్రభాకరన్ నమ్మాడు. కానీ, అక్కడి తమిళ వ్యతిరేక ప్రభుత్వం అమెరికా, తన భాగస్వామ్య దేశాలతో కలిసి పూర్తిగా తమిళ ఈలం పోరాటాన్ని తొక్కేసింది.

ఒకవేళ నిజంగా ఈనాడు ప్రభాకరన్ ఉండి ఉంటే.. తప్పకుండా శ్రీలంక గద్దెను ఎక్కేవాడు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను గొప్ప విముక్తి పోరాటంగా మలుచుకొని శ్రీలంకను సరికొత్త బాటలో పయనింప చేసేవాడు అని అనడంలో అతిశయోక్తి లేదు.

First Published:  10 May 2022 11:38 AM GMT
Next Story