Telugu Global
CRIME

పంజాబ్ లో పేలుడు.. రాకెట్ లాంచర్లు ఉపయోగించారా..?

భారీ పేలుడుతో ఒక్కసారిగా పంజాబ్ ఉలిక్కిపడింది. అందులోనూ ఆ పేలుడు జరిగింది మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో కావడం మరో పెద్ద సంచలనంగా మారింది. సెక్టార్‌ 77, SAS నగర్‌లో ఉన్న పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి 7.45 గంటలకు ఈపేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ ఆఫీస్ పై ఎవరైనా రాకెట్ లాంచర్లతో దాడి చేశారా..? లేక ఆఫీస్ లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు […]

పంజాబ్ లో పేలుడు.. రాకెట్ లాంచర్లు ఉపయోగించారా..?
X

భారీ పేలుడుతో ఒక్కసారిగా పంజాబ్ ఉలిక్కిపడింది. అందులోనూ ఆ పేలుడు జరిగింది మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో కావడం మరో పెద్ద సంచలనంగా మారింది. సెక్టార్‌ 77, SAS నగర్‌లో ఉన్న పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి 7.45 గంటలకు ఈపేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ ఆఫీస్ పై ఎవరైనా రాకెట్ లాంచర్లతో దాడి చేశారా..? లేక ఆఫీస్ లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో మూడో అంత‌స్తులో ఈ పేలుడు జరిగింది. ఆ ధాటికి ఆఫీసు త‌లుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ప‌దార్థాల‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర‌వాద దాడి అనే అనుమానం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధృవీకరించడంలేదు. మొహాలీలో పంజాబ్ పోలీస్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. పేలుడు జ‌రిగిన ఇంటెలిజెన్స్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో సుహానా సాహెబ్ గురుద్వారా కూడా ఉంది. ఈ పేలుడు ధాటికి స‌మీప భ‌వ‌నాలు కూడా దెబ్బ తిన్నాయి.

పేలుడు జరిగిన వెంట‌నే ఆ ప్రాంతాన్ని పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే పంజాబ్‌ పోలీసులు ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన తాజా ఘటనతో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

First Published:  9 May 2022 9:12 PM GMT
Next Story