Telugu Global
NEWS

నారాయణ అరెస్ట్ అందుకే.. పక్కా ఆధారాలున్నాయి.. మంత్రుల క్లారిటీ..

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంలో ఉన్న సందిగ్ధదతకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెరదించారు. ఆయన్ను టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఐపీసీ 408, పబ్లిక్‌ పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టం కింద పోలీసులు నారాయణపై కేసు నమోదు చేశారన్నారు. నారాయణ స్కూల్‌ సిబ్బందే టెన్త్‌ పేపర్లు బయటకు పంపారని చెప్పారు. పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటివరకూ 60 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, టీడీపీ రాజకీయ విమర్శలు […]

నారాయణ అరెస్ట్ అందుకే.. పక్కా ఆధారాలున్నాయి.. మంత్రుల క్లారిటీ..
X

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంలో ఉన్న సందిగ్ధదతకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెరదించారు. ఆయన్ను టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఐపీసీ 408, పబ్లిక్‌ పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టం కింద పోలీసులు నారాయణపై కేసు నమోదు చేశారన్నారు. నారాయణ స్కూల్‌ సిబ్బందే టెన్త్‌ పేపర్లు బయటకు పంపారని చెప్పారు. పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటివరకూ 60 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, టీడీపీ రాజకీయ విమర్శలు చేస్తోందని, నిజంగా తప్పు చేయకపోతే.. ధైర్యంగా చెప్పాలన్నారు బొత్స.

ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ఉన్నాడనే ప్రాథమిక ఆధారాలతోనే ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారని చెప్పారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. నారాయణ అరెస్ట్‌ పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆధారాలతో సహా అరెస్ట్‌ చేస్తే దానిపై టీడీపీ గందరగోళం ఏమిటో అర్థం కావడం లేదన్నారు అంబటి. లీక్ చేసేది వాళ్లే.. గందరగోళం చేసేది వాళ్లే.. రాష్ట్రంలో జరిగే చాలా విషయాల్లో ఇలాగే చేస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కు పెట్టారు అంబటి. వాళ్లేమో లీక్ చేయొచ్చు.. మేము మాత్రం యాక్షన్ తీసుకోవద్దా…? అని ప్రశ్నించారు. ఇలాంటి లీకుల వల్లే నారాయణ సంస్థ నెంబర్ 1 ర్యాంకులు సాధిస్తోందని అన్నారు అంబటి. పక్కా ఆధారాలతోనే పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే టెన్త్ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని అన్నారు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికే ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి విచారణ జరిగాకే.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ అరెస్ట్ లో ఎలాంటి కక్ష సాధింపు లేదని, విచారణలోనే నిజాలు వెలుగు చూశాయని స్పష్టం చేశారు.

First Published:  10 May 2022 11:16 AM IST
Next Story